నల్గొండ

నూతన గ్రామ పంచాయతీలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 18: జిల్లాలో నూతన గ్రామపంచాయితీల ఏర్పాటుకు ఈనెల 22వతేదీలోగా ప్రతిపాదనలు పంపించాలని జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లో తహశీల్థార్‌లు, ఎంపీడీవోలు, సర్వేయర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్ధం తండాలను గ్రామపంచాయితీలుగా ఏర్పాటుచేస్తుందన్నారు. వచ్చే నెలలో గ్రామపంచాయితీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నందున నూతన గ్రామపంచాయితీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని కోరారు. జిల్లాలో ప్రస్తుతం 323 గ్రామపంచాయితీలు ఉన్నాయని కొత్తగా 161 గ్రామపంచాయితీల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందినట్లు తెలిపారు. 500 జనాభా కలిగి మండల కేంద్రాలకు 5కిలోమీటర్ల దూరంలో గల తండాలను గ్రామపంచాయితీలుగా అధికారులు గుర్తించి పంచాయితీరాజ్ చట్టం నిబంధనలకు లోబడి ప్రతిపాధనలు సిద్దం చేయాలని కోరారు. నూతనంగా ఏర్పాటుచేసే గ్రామ పంచాయితీల మ్యాప్‌ల తయారి, సర్వే నెంబర్లు, గ్రామపంచాయితీ తదితర వివరాలను సూచించిన నమూన నివేదికలో పొందుపర్చాలని ఇందుకోసం రెవిన్యూ అధికారులు, పంచాయితీరాజ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో చేపట్టిన భూరికార్డుల శుద్దికరణలో భాగంగా 279 రెవిన్యూ గ్రామాల్లో మార్చి 11న పట్టాదార్ పాస్‌పుస్తకాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లను సిద్దం చేయాలని తహశీల్ధార్‌లను ఆదేశించారు. భవిష్యత్తులో డిజిటల్ పట్టాదార్ పాస్‌పుస్తకాలు వస్తున్నందున తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలన్నారు.

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
*ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్

మోత్కూర్, జనవరి 18: టీఆర్‌యస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క టీ ఆర్‌యస్ కార్యకర్తపై ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం తుంగతుర్తి ప్రగతి బాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మోత్కూర్‌లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఎమ్మెల్యే గాదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గ్రామగ్రామాన టీఆర్‌యస్ పార్టీని బలోపేతం చేసి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించాలన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 44వేల మందికి ఆసరా పింఛన్లు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కిందన్నారు. వెయ్యి కోట్ల నిధులతో తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. మోత్కూర్, అడ్డగూడూరు మండలాల్లో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం గ్రంథాలయ చైర్మన్ కె.మత్య్సగిరి ప్రచురించిన ప్రగతి బాటసారి- ఉద్యమ కిశోరం కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. టీడీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్‌యస్‌లో చేరారు.