నల్గొండ

మాచర్లకు మళ్లుతున్న ‘కేసీఆర్’ గొర్రెలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్వపల్లి, జనవరి 19: గుంటూరు జిల్లా మాచర్ల నుండి కొనుగోలు చేసి యాదవులకు అందజేస్తున్న గొర్రెలు వారం పదిరోజుల్లోనే తిరిగి మాచర్లకు చేరుతున్నాయి. సోసైటీలోని ప్రతి సభ్యునికి రూ. లక్ష 25వేలతో 21 గొర్రెలను ప్రభుత్వం యాదవులకు అందిస్తుంది. ప్రభుత్వం అందజేస్తున్న గొర్రెలను లబ్దిదారులు తిరిగి మాచర్లకు చెందిన గొర్రెల వ్యాపారులకు అమ్ముతున్నారు. శుక్రవారం అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెంకు చెందిన బింగి రమేష్, బింగి యల్లప్ప, నాగారం మండలం జికొత్తపల్లికి చెందిన కాసం లింగయ్య, కాసం నాగరాజు, కాసం హన్మంత్‌లు ప్రభుత్వం అందజేసిన 105 గొర్రెలను గుంటూరు జిలా మాచర్లకు చెందిన గొర్రెల వ్యాపారులు పసుల మల్లయ్య, యాండ్ర కోటేశ్వరరావులు కొనుగోలు చేసి మాచర్లకు తరలిస్తుండగా పక్కా సమాచారంతో సీఐ రవీందర్, ఎస్సై మోహన్‌రెడ్డిలు పట్టుకున్నారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసిన గొర్రెలను కొన్నా, అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.