నల్గొండ

బంగారు తెలంగాణ సాధనే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డగూడూరు, జనవరి 19: టీఆర్‌యస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క టీఆర్‌యస్ కార్యకర్తపై ఉందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. శుక్రవారం అడ్డగూడూరు మండల కేంద్రంలో ప్రగతి బాట కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తొలుత రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం పాదయాత్ర ద్వారా వాడ వాడన తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చౌరస్తాలోని అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిశోర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. నాలుగు సంవత్సరాల కాలంలో 365 పథకాలు అమలుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. నియోజకవర్గంలో 44వేల మందికి ఆసరా పింఛన్లు అందించిన ఘనత టీఆర్‌యస్ ప్రభుత్వానికే చెందిందన్నారు. అడ్డగూడూరును మండల కేంద్రంగా ప్రకటించిన ఘనత టీఆర్‌యస్‌కే దక్కిందని, మండల అభివృద్ధికి తన శాయాశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, ఎంపీపీ ఓర్సు లక్ష్మి, టీఆర్‌యస్ మండల అధ్యక్షుడు పొన్నాల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ పూలేపల్లి జనార్థన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మేఘారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు రణధీర్‌రెడ్డి, టీఆర్‌యస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు గోదల యశోద, నాయకులు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, వివిధ గ్రామాల టీఆర్‌యస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.