నల్గొండ

పోలీసు పనితీరులో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 22: రాష్టవ్య్రాప్తంగా ఒకే విధమైన పోలీసింగ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. నూతన సాంకేతికత సహయంతో ప్రజలు నచ్చే, మెచ్చే విధంగా పోలీస్‌శాఖలో మార్పులు తీసుకువస్తున్నట్లు చెప్పారు. జిల్లాకేంద్రం శివారులోని నల్లచెరువు వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.25కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయ భవన నిర్మాణ స్థలాన్ని సోమవారం సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన భవన సముదాయ నిర్మాణ నమూనాను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన తెలంగాణను నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా పోలీస్ యంత్రాంగం కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఏనేరం చేసిన దొరికిపోతామని, నేరం చేసిన వారికి చట్టప్రకారం శిక్ష పడుతుందనే నమ్మకం కలిగించేలా మార్పులు తీసుకువస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పోలీస్‌శాఖలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చి తద్వారా నేరాలను అదుపుచేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. అందులో భాగంగానే రాష్టవ్య్రాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నామని, ఒక్క సీసీ కెమెరా 100మంది పోలీసులతో సమానమన్నారు. నేరస్తుల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోశిస్తున్నాయన్నారు. ప్రజామితృత్వ పోలీస్ వ్యవస్థను అమలుచేస్తూ పోలీసులతో ప్రజలు స్నేహితులుగా మెలిగే వాతావరణం కల్పిస్తున్నామన్నారు. పోలీస్‌స్టేషన్‌లకు వెళ్లిన ప్రతి ఒక్కరినీ సాదరంగా గౌరవించి వారి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ ప్రజల ఆధరాభిమానాలు చొరగొంటున్నామన్నారు. హోంగార్డు నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు పోలీస్‌శాఖ సిబ్బంది అంతా అంకితభావంతో సేవలు అందిస్తున్నారనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించామన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పోలీస్‌శాఖ ముందజలో ఉందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోలీసులు పూర్తిస్థాయిలో సమర్ధవంతంగా సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ప్రజల మనోభావాలను అనుగుణంగా పనిచేస్తున్నారన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. నూతన జిల్లాల ఏర్పాటు వల్ల ప్రజల ముంగిటకే పరిపాలన వచ్చిందన్నారు. కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో నిర్మిస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయ భవన నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో ఏడాదిలోగా పూర్తిచేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్వ్రీంద్ర, జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్, ఎస్పీ ప్రకాశ్‌జాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జానా ఇలాకాలో కారుజోరు
* టిఆర్‌ఎస్‌లో చేరిన నిడమనూర్ కాంగ్రెస్ ఎంపిపి
* సాగర్ నియోజకవర్గంలో ఎంపిపిలంతా గులాబీ గూటికే
* కెసిఆర్ పాలన మెచ్చే పార్టీలోకి బారులు : మంత్రి జి.జగదీష్‌రెడ్డి

నల్లగొండ, జనవరి 22: కాంగ్రెస్ శాసన సభ పక్ష నేత కె.జానారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి టిఆర్‌ఎస్‌లోకి భారీగా వలసల పర్వం కొనసాగింది. సోమవారం తెలంగాణ భవన్‌లో మంత్రి జి.జగదీష్‌రెడ్డి సమక్షంలో సాగర్ నియోజకవర్గం పరిధిలోని నిడమనూర్ ఎంపిపి దాసరి నరసింహా, పెద్దవూరా మండలం కొత్తలూరు సర్పంచ్ ఒద్దిరెడ్డి రవిందర్‌రెడ్డి, సిరసనగండ్ల సర్పంచ్ పవన్‌కుమార్, నెల్లికల్ మాజీ సర్పంచ్ జఠావత్ పంతులునాయక్, త్రిపురారం మండలం టిడిపి అధ్యక్షుడు కలకుండ వెంకటేశ్వర్లు టిఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. నియోజకవర్గంలో జానాకు కీలక అనుచరుడిగా ఉన్న నిడమనూర్ ఎంపిపి దాసరి నరసింహా టిఆర్‌ఎస్‌లో చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల నిడమనూర్ మండలం ఎర్రబెల్లి ఎంపిటీసి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పై టిఆర్‌ఎస్ 568ఓట్ల భారీ మెజార్టీతో గెలిచింది. ఇప్పటికే సాగర్ నియోజకవర్గంలో గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సాగర్ నియోజకవర్గంలోని పెద్దవూరా, త్రిపురారం, హాలియా, గుర్రంపోడు ఎంపిపిలతో పాటు త్రిపురారం, గుర్రంపోడు జడ్పీటీసిలు టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. తాజాగా నిడమనూర్ ఎంపిపి కూడా టిఆర్‌ఎస్‌లో చేరడంతో సాగర్ నియోజకవర్గంలోని మొత్తం ఐదు మండలాల ఎంపిపిలంతా టిఆర్‌ఎస్‌లో చేరినట్లయ్యింది. ఈ పరిణామం స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.జానారెడ్డికి రాజకీయంగా ఇబ్బందిరకంగా భావిస్తున్నారు. కాగా ప్రతిపక్ష పార్టీల స్థానిక ప్రజాప్రతినిధులను టిఆర్‌ఎస్‌లో చేర్చడంలో జిల్లా మంత్రి జి.జగదీష్‌రెడ్డి, సాగర్ నియోజకవర్గ టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి నోముల నరసింహాయ్యలు చూపిన చొరవ ఫలించడం నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ బలోపేతానికి బాటలు వేసింది.
కెసిఆర్ పాలనను మెచ్చే : మంత్రి జగదీష్‌రెడ్డి
సీఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న పాలనను మెచ్చే ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు టిఆర్‌ఎస్‌లోకి బారులు కడుతున్నారని మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో నిడమనూర్ కాంగ్రెస్ ఎంపిపితో పాటు సాగర్ నియోజకవర్గంలోని ప్రతిపక్ష పార్టీల సర్పంచ్‌లు, నాయకులను టిఆర్‌ఎస్‌లోకి స్వాగతించిన మంత్రి జగదీష్‌రెడ్డి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధికి సీఎం కెసిఆర్ ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ నాయకులు దొంగ కేసులతో అడ్డుకుంటున్నారన్నారు. రైతులకు 24గంటల విద్యుత్ సరఫరా చేస్తుంటే వ్యతిరేకిస్తున్నారన్నారు. ఏడుదశాబ్ధాలు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పాలన పాపమే భూగర్భ జలాల కొరతకు కారణమన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రంలో ప్రగతి నిరోధకులుగా మారారని ప్రజలు విజ్ఞతతో అర్ధం చేసుకునే టిఆర్‌ఎస్‌లోకి బారులు కట్టి చేరుతున్నారన్నారు. సాగర్ డెడ్‌స్టోరేజీలో కూడా మూడేళ్లుగా ఎడమకాలువ రైతులకు నీరందించిన ఘనత టిఆర్‌ఎస్‌దేనన్నారు. తెలంగాణ గుండా కృష్ణా, గోదావరిలు సాగుతున్నా ఈ ప్రాంత ప్రజలకు నది జలాలను అందించలేని అసమర్ధ కాంగ్రెస్ నేడు కాళేశ్వరం ప్రాజెక్టును అభినందించాల్సిందిపోయి అడ్డుకోచూడటం సిగ్గుచేటన్నారు. ప్రజల ఆధరణతో రానున్న కాలంలో టిఆర్‌ఎస్ అన్ని ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగురేస్తుందన్నారు.