నల్గొండ

ఇది రైతు నామ సంవత్సరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేటటౌన్, మార్చి 18: ఈవిలంభినామ సంవత్సరం రైతునామ సంవత్సరంగా మారుతుందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్దిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో, వేదాంతభజన మందిరంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయంలో మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో దేవాలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు పంచాంగ పఠనం చేయగా మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు శ్రద్దగా విన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈసంవత్సరం రైతులకు స్వర్ణయుగం కాబోతుందని, ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు భీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తుందన్నారు. రైతుబాగుంటేనే సమాజం బాగుంటుందని, రైతు సంతోషంగా ఉండేందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా తోడ్పాటునందిస్తుందన్నారు. రైతుల నీటి కష్టాలు తొలగించేందుకు ఇరిగేషన్ ప్రాజెక్టులకు వేల కోట్లలో నిధులు ఖర్చుచేస్తూ పనులు వేగంగా పూర్తిచేయడం జరుగుంతుందన్నారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, నాయకులు మొరిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ కర్ణాకర్‌రెడ్డి, కట్కూరి గన్నారెడ్డి, తాహేర్‌పాషా, ఆకుల లవకుశ తదితరులు పాల్గొన్నారు.

రాహుల్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా
* కట్టంగూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదగిరి
కట్టంగూర్, మార్చి 18: కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెరుకు యాదగిరి అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్‌పార్టీ 84వ ప్లీనరీకి హాజరైన ఆయన ఆదివారం మండల విలేఖరులతో మాట్లాడుతూ ప్లీనరీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రసంగం ఎంతో ఉత్తేజపరిచిందని, ఆయన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు.

మినీ ట్యాంక్‌బండ్‌కు అప్పయ్య పేరు
కోదాడ, మార్చి 18: కోదాడ మినీ ట్యాంక్‌బండ్‌కు మాజీ సర్పంచ్, కోదాడ గాంధీగా పేరుగాంచిన గుడుగుంట్ల చిన్న అప్పయ్య పేరు పెట్టాలని ఆర్యవైశ్యసంఘం నాయకులు తీర్మానించారు. ఆదివారం వాసవీభవన్‌లో జరిగిన పట్టణ, మండలస్థాయి ఆర్యవైశ్యుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇంతవరకు కోదాడ వైశ్యులు ఓట్లు వేయటానికి, చిన్న చిన్న పదవులకే అంకితం చేశారని, కానీ ఈ సారి తమ న్యాయమైన కోరికను కోరుతున్నామని, చిన్న అప్పయ్య కోదాడకు ఎనలేని సేవలు అందించారని అన్నారు. రాష్ట్రప్రభుత్వం వైశ్య కార్పోరేషన్‌ను 100 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. పట్టణ అధ్యక్షులు పయిడిమర్రి నారాయణరావు, ఓరుగంటి ప్రభాకర్, యాదా రమేష్, కుక్కడపు బాబు, రాయపూడి వెంకటనారాయణ, ఇడుకుళ్ళ చెన్నకేశవులు, గరిణె శ్రీనివాసరావు, వంగవేటి గురునాథం, యాదా సుధాకర్, చల్లా ప్రకాశరావు, విజయశేఖర్, గరిణె శ్రీ్ధర్, వెంపటి ప్రసాద్, తూములూరి భాస్కర్, మధు, మహంకాళి సత్యనారాయణ, నారాయణ, గరిడేపల్లి లక్ష్మణరావు పాల్గొన్నారు.