నల్గొండ

స్వయం ఉపాధితో అభివృద్ధి బాటలోకి రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలేరు, డిసెంబర్ 28: యువత తనలోని నైపుణ్యాలతో స్వయం ఉపాది పొంది అభివృద్ది బాటలోకి రావాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు అన్నారు. సోమవారం స్థానిక పద్మావతీ గార్డెన్‌లో రామచంద్రారెడ్డి, కమలాదేవి షౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్ద, ఖాదీ, గ్రామీణ మండలి ఆధ్వర్యంలో గ్రామీణ పరిశ్రమలు, శిక్షణ అవకాశాలు అనే అంశంపై అవగాహన సదస్సు, శిక్షణ పొందిన వారి ధృవ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సృజనాత్మకత ఉంటుందని దాన్ని గుర్తించి ఆయా రంగాలలో రాణించాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్న శిక్షణను యువత ఉపయోగించుకొని ఉపాధి అవకాశాలను మెరుగు పరచుకోవాలన్నారు.
గ్రామీణ ప్రాంత యువతకు శిక్షణను ఇవ్వడానికి ఆరుట్ల ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయం అన్నారు. ఆరుట్ల దంపతుల పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, ప్రముఖ కవి, సాహితీవేత్తలు కందిమల్ల ప్రతాప్‌రెడ్డి, రంగయ్య, స్వామి రామానంద తీర్ద, కిశోర్‌రెడ్డి, కాధీ గ్రామీణ మండి ప్రిన్సిపల్ రాయప్ప, ఎంపిపి అనసూర్య, సంర్పంచ్ సంతోష్, ఫౌడేషన్ అధ్యక్షులు సుశీలాదేవి, ఆరుట్ల శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నల్లగొండ రూరల్, డిసెంబర్ 28: కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను సోమవారం నల్లగొండ పట్టణంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి నివాసంలో పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్‌రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కత్తుల కోటి, పెరిక వెంకటేష్వర్లు, బంగారయ్య, హరిప్రసాద్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చెర్లపల్లి గౌతమ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేందర్, శ్రీనివాస్, మహేష్, రైసొద్దీన్, జానీ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిలో..
భువనగిరి: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవాన్ని, అదేవిధంగా పిజెఆర్ 9వ వర్ధంతిని భువనగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సోమవారం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జండాను ఆవిష్కరించారు. అదేవిధంగా ఖైరతాబాద్ శాసనసభ్యుడు పి.జనార్ధన్‌రెడ్డి 9వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలదండవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కుంభం అనీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పేదల పండుగదినోత్సవంగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలందించి రాష్ట రాజధాని హైద్రాబాద్, సికింద్రాబాద్ పట్టణాల ప్రజల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి జనార్ధన్‌రెడ్డి లేనిలోటు ఎవ్వరు తీర్చలేనిదని అన్నారు. ఈకార్యక్రమంలో మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ పోత్నాక్ ప్రమోద్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు టి.రవికుమార్, ఎడమ బాలక్రిష్ణ, పుమారు సత్యనారాయణ, పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్, రాసాల దత్తుయాదవ్, బద్దం రవీందర్‌రెడ్డి, కొత్తబాల్‌రాజ్, ఎండి హమీద్, దర్గాయి హరిప్రసాద్, నాకోటి రాము, నానం క్రిష్ణ, బెండ శ్రీకాంత్, ఎడమ పవన్ పాల్గొన్నారు.
యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో...
పట్టణంలోని ఏరియా హాస్పిటల్‌వద్ద యువజన కాంగ్రెస్ ఆద్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బర్రె జహాంగీర్ పాల్గొని పార్టీ జండాను ఆవిష్కరించారు. అదేవిదంగా మండలంలోని బొల్లెపల్లి గ్రామంలో ఆపార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎండి ఫక్కీర్ అహ్మద్ ఆద్వర్యంలో పార్టీ జండాను ఆవిష్కరించి అవిర్భావదినోత్సవాన్ని నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో డి.రాములు, సయ్యద్ ముల్తానిషా, గ్యాస్ చిన్న, నక్కల ఆదినారాయణ పాల్గొన్నారు.
బీబీనగర్‌లో...
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పార్టీ జండాను యువజన కాంగ్రెస్ నాయకులు నారగోని మహేశ్‌గౌడ్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమంకోసం పనిచేస్తున్నదని అన్నారు.
ప్రజలు ఎల్లప్పుడు పార్టీకి అండగా ఉంటారని తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు వి.విరేశం, సన్నిబోయిన ప్రసాద్, బెండ ప్రవీణ్, పంజాల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.