నల్గొండ

వట్టిపోతున్న బోర్లు - ఎండిపోతున్న పంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, మార్చి 21: వేసవి కాలం ప్రారంభంలోనే నల్లగొండ మండలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో ఆయా గ్రామాల్లో కరువు విలయతాండవం చేస్తోంది. మరో నెల, రెండు నెలల్లో ఈ పరిస్థితి విపరీతంగా ఉంటుందని చెప్పవచ్చు. మిషన్ కాకతీయ చెరువుల్లో సైతం బురదతో కూడిన నీరు మాత్రమే ఉండి పశుపక్షాదులకు దాహార్తి తీర్చలేని పరిస్ధితి దాపురించింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇవ్వడంతోనే ఈ సమస్య జఠిలమైందని పలువురు పేర్కొంటున్నారు. గతంలో అందించిన విద్యుత్‌తో పంటలు ఎండిపోలేదని, నేడు 24గంటల కరెంట్ వల్ల భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వట్టిపోతున్నాయని రైతన్నలు పేర్కొంటున్నారు. అదే విధంగా బోర్లలో ఎక్కువగా నీళ్లున్న రైతులు తమ మోటార్లను కట్టిపెట్టకుండా ఉండటంతో ఇతర బోర్లు సైతం పోయక రైతన్నలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలే అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులకు పంట చేతికొచ్చే సమయానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పంట ఎండిపోవడంతో చేసేదేమీ లేక రైతులు పశువులు మేపడం, పశువుల మేతకు వరిని మోసుకెళ్లడం జరుగుతుంది. నల్లగొండ మండలంలో దాదాపు సగంపైగా గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు ప్రతీ రోజూ కనిపించడం గమనార్హం. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు మోటార్లతో పాటు ఆయా గ్రామాల్లో ఉన్న స్కీం బోర్లు, చేతి పంపుల్లో సైతం చుక్క నీరు రావడం లేదు. దీంతో అటు సాగు, ఇటు తాగునీటికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఏది ఏమైనా సర్కారు అందిస్తున్న 24 గంటల కరెంట్ సరఫరా హర్షణీయమైనప్పటికీ ఇబ్బందుల దృష్ట్యా 12గంటలకు మార్చాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.