నల్గొండ

ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణం అయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, మార్చి 22: ఉమ్మడి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో అంతర్జాతీయ ప్రమాణాలతో కాలుష్య రహితంగా ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రీయల్ పార్కు పనుల్లో తీవ్రమైన జాప్యం కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వం కాలుష్య రహిత పార్కు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించి దండుమల్కాపురం ప్రాంతాన్ని ఎంపిక చేసింది. సుమారు వెయ్యి ఎకరాలలో గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు జర్మనికి చెందిన జిఐజెడ్ సంస్థ సహకారం తీసుకుంది. దేశంలోనే మొదటిసారిగా కాలుష్య రహిత పరిశ్రమగా నిర్మాణం చేయాలని నిర్ణయించింది. ఏడాది లోపు ఉత్పత్తులను ప్రారంభించి సుమారు రెండు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గత బడ్జెట్ సమావేశాలలో మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మంత్రి బడ్జెట్ సమావేశాలలో చేసిన ప్రకటనకు ఏడాది పూర్తి అవుతుంది కానీ ఇండస్ట్రీయల్ పార్కు పనులు కూడా ప్రారంభంకాలేదు. భూసేకరణలో కొనసాగుతున్న జాప్యంతో ఇంక శంకుస్థాపనకు కూడా నోచుకోని పరిస్థితి నెలకొంది. దీంతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. సుమారు 1246 ఎకరాల్లో పార్కును నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 128 మంది రైతుల నుంచి 371.06 ఎకరాల అసైన్డ్ భూములను రైతుల నుంచి ఎకరాకు రూ.11.60లక్షలు చెల్లించి సేకరించింది. ఈ ప్రాంతంలోనే సూక్ష్మ, చిన్నతరహ పరిశ్రమలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 681.26 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 580 ఎకరాలు భూసేకరణ కొలిక్కి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. తక్కువ పరిహారం ఇస్తుండటంతో మరో 101.19 ఎకరాల పట్టా భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేకపోవడంతో ప్రభుత్వం భూముల స్వాధీనానికి నోటీఫికేషన్ విడుదల చేసింది. దీంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తున్నట్లు సమాచారం. జాతీయ రహదారి నుంచి ఇండస్ట్రీయల్ పార్కు వరకు రోడ్డు నిర్మాణం, పార్కులో నాలుగు లేన్ల రోడ్లు నిర్మించేందుకు, భూగర్భ నీటిపారుదల వ్యవస్థ, నిరంతర విద్యుత్, ఎల్‌ఈడీ దీపాలు, మిషన్ భగీరథ నీళ్లు సరఫరా తదితర అభివృద్ధి పనులకు ప్రభుత్వం 36 కోట్ల రూపాయలు విడుదల చేసింది. పనులు ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇండస్ట్రీయల్ పార్కులో సుమారు 15వేల కోట్ల రూపాయలతో 400 వరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇండస్ట్రీయల్ పార్కుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చొరవతో రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తుండటంతో మే మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు ఉన్నతాధికారులు సన్నాహలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా సమస్యలు తొలగిపోయి ఇండస్ట్రీయల్ పార్కు నిర్మాణం పూర్తి చేసుకొని ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని గంపెడు ఆశలతో నిరుద్యోగులు ఎదిరిచూస్తున్నారు.

నీటిని పొదుపుగా వాడాలి
కలెక్టర్ గౌరవ్ ఉప్పల్
రామగిరి, మార్చి 22: వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు జగిని టెక్స్‌టైల్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని గడియారం సెంటర్‌లో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నీటిని దుర్వినియోగం చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. జగిని టెక్స్‌టైల్స్ సహకారంతో పట్టణంలో 14 చలివేంద్రాలు ఏర్పాటుచేశారన్నారు. అదే విధంగా పట్టణంలోని ఆయా కూడళ్లలో బారికేడ్లు, బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం కుర్చీలు ఏర్పాటుచేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.

కనకదుర్గ గుడిలో మహాస్వామి పూజలు
మిర్యాలగూడ టౌన్, మార్చి 22: పట్టణంలోని గాంధీనగర్‌లో ఉన్న కనకదుర్గ ఆలయంలో కనకదుర్గమ్మకు శ్రీశ్రీశ్రీవామనాశ్రమ మహాస్వామి గురువారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాన్ని దర్శించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. మళ్లీ కొన్ని దినాల అనంతరం కనకదుర్గమ్మను దర్శించుకుంటానన్నారు. దేవాలయ దర్శన భాగ్యం కలగడం ఆనందదాయకమన్నారు. అధ్యాత్మికతను అలవర్చుకోవాలన్నారు. ధార్మిక కార్యక్రమాల్లో తరచు పాల్గొన్నాలన్నారు.