నల్గొండ

హామీలన్నీ కార్యరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 24: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందుతున్నాయని ఇక రాష్ట్రంలో అన్ని ప్రారంభోత్సవాలే ఉంటాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గొల్లగూడెంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలతో వేగంగా నిర్వహించాలని సూచించారు. ఇసుక, సిమెంట్ వంటి వాటి సరఫరాలకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. యావత్ భారత దేశంలో ఎన్నికల ప్రణాళికను అమలు చేసిన ఘనత సీఎం కెసిఆర్‌దేనన్నారు. ఎన్నికల ప్రణాళికలో లేని కల్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్, ఒంటరి మహిళలకు పింఛన్, రైతు బంధు పథకాలను సైతం తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. తెలంగాణ వస్తే చీకట్లేనన్న సీమాంధ్ర పాలకుల భయాలను చీల్చి రెప్పవాలకుండా నిరంతర విద్యుత్ అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్‌ల ఇళ్ల నిర్మాణాలు నల్లగొండ జిల్లాలో వేగంగా సాగుతున్నాయని త్వరలోనే వరుస ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హౌజింగ్ పిడి రాజ్‌కుమార్, ఆర్డీవో వెంకటాచారి, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నల్లగొండ మెడికల్ కళాశాల నిర్మిస్తాం
సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు నల్లగొండ మెడికల్ కళాశాల నిర్మాణాన్ని త్వరలోనే చేపట్టనున్నట్లుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని స్థలాన్ని మెడికల్ కళాశాల నిర్మాణం కోసం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పాత, కొత్త భవనాల్లో, మాతాశిశుసంరక్షణ కేంద్రాల్లో ఉన్న పడకల సామర్ధ్యం, సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా మంత్రి రాకను గమనించిన పలువురు రోగులు మంత్రి వద్ధకు వచ్చి తమకు ఆసుపత్రిలో సరైన రీతిలో వైద్య సేవలందడం లేదని, వైద్యులు, సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని మొర పెట్టుకున్నారు. సక్రమంగా వైద్య అందక శిశు మరణాలు చోటుచేసుకుంటున్నాయని బాధిత మహిళల బంధువులు ఆరోపించారు. వారి సమస్యలు విన్న మంత్రి జగదీష్‌రెడ్డి ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను, సూపరిండెంట్ నర్సింగ్‌రావును ఆదేశించారు. మంత్రి వెంట అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, తహశీల్ధార్ వినయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

హామీల అమలులో కేంద్రం విఫలం
* సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు
వలిగొండ, మార్చి 24: కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో విఫలమైందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. వచ్చెనెల 18 నుండి 22 వరకు హైద్రాబాద్‌లో నిర్వహించే సీపీఎం జాతీయ మహాసభల విజయవంతంకై చేపట్టిన బస్సుయాత్ర శనివారం సాయంత్రం వలిగొండకు చేరుకోగా సీపీఎం శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ రైతులకు న్యాయం చేయకపోవడంతోనే మహారాష్ట్రంలో 50వేల మంది రైతులు మహాధర్నా నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచి తమ డిమాండ్‌లను సాధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోతినేని సుదర్శన్, జాన్‌వెస్లీ, ఎండీ.జహాంగీర్, బోరెడ్డి సంబశివ, కొండమడుగు నర్సింహ్మా, వేముల మహేందర్, మాటారి బాలరాజు, కల్లూరి మల్లేశం, మద్దెల రాజయ్య పాల్గొన్నారు.

హుజూర్‌నగర్, దేవరకొండ
ఇక పురపాలికలు
నల్లగొండ, మార్చి 24: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగానల్లగొండ జిల్లాలోని దేవరకొండ నగర పంచాయితీని, సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ నగర పంచాయితీలను మున్సిపాల్టీలుగా అప్‌గ్రేడ్ చేస్తు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవరకొండ మున్సిపాల్టీ అప్‌గ్రేడ్ ఉత్తర్వులను స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ దేవరకొండ శాసన సభ్యులు ఆర్.రవీంద్రకుమార్‌కు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గిరిజన ప్రాంతమైన దేవరకొండ మున్సిపాల్టీ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.