నల్గొండ

కరవు సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట టౌన్, మే 3: రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తున్నా కరవు సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. కరవు పర్యటనలో భాగంగా మంగళవారం మండలపరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో ఎండిపోయిన తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా తీవ్ర కరవు పరిస్థితులు నెలకొని భూగర్భ జలాలు అడుగంటిపోయి ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న స్పందించే పరిస్థితి లేకపోవడం విచారకరమన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎన్నికలపై, పార్టీ పిరాయింపులపై ఉన్న శ్రద్ద రైతులపై లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాటుపడుతున్న ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికి వదిలేస్తుందన్నారు. పాలేరు ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓడిపోయిన తాము తలెత్తుకు తిరగగలమని టిఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోతే తలెత్తుకు తిరగగలరా అని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నందున జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి కరవు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని మండలానికి రూ.10కోట్లు విడుదల చేసి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటి సభ్యుడు నంద్యాల నర్సింహ్మారెడ్డి, నాయకులు ముల్కలపల్లి రాములు, తిరందాసు గోపి, మల్లు గౌతమ్‌రెడ్డి, నాగార్జున్‌రెడ్డి, మల్లు లక్ష్మి, నెమ్మాది వెంకటేశ్వర్లు, చెరుకు సత్యం, ఏకలక్ష్మి, మట్టిపెల్లి సైదులు, మందడి రాంరెడ్డి, కోట గోపి, మేకనబోయిన శేఖర్, ఎల్గూరి గోవింద్, జ్యోతి తదితరులున్నారు.