నల్గొండ

భగీరథ పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, మే 5: మిషన్ భగీరధ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం మిషన్ భగీరధపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైప్‌లైన్ల నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలన్నారు. పైప్‌లైన్లు వెయ్యడంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. వ్యవసాయ భూములలో నాట్లు పడక ముందే పూర్తి చేయాలన్నారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్దం చేసుకుని రోజుకు ఎన్ని కిలోమీటర్ల పనులు చేపడుతున్నారో, ఎన్ని ప్రొక్లీన్లను వాడుతున్నారో సమాచారమివ్వాలన్నారు. జూన్ చివరినాటికి 636గ్రామాలకు మంచి నీరు అందించాలని కోరారు. ఆలేరు, భువనగిరి నియోజక వర్గాలతోపాటు తుంగతుర్తి నియోజక వర్గాలలోని, తిర్మలగిరి మండలాలలోని గ్రామాలకు నిర్ణయించిన సమయానికి మంచినీరు అందించే విధంగా పనులు చేపట్టాలన్నారు. కాంట్రాక్టర్లు అవసరమైన మిషన్ల మెటీరియల్‌ను తక్షణమే సమకూర్చుకోవాలని ఆయన ఆదేశించారు. రోడ్డు పక్కన పైప్‌లైన్లను నిర్మించే టపుడు సమస్యలు తలెత్తితే అధికారులు తమకు తెలియజేయాలని తెలిపారు. మెయిన్ పైపులైన్లు, ఇంటర్ విలేజ్‌పైపులైన్ల పనులు సమాంతరంగా జరగాలన్నారు. అధికారులు నీటి నిల్వ నిర్మాణాలు ఎక్కడెక్కడ చేపట్టాలంటే అక్కడ వెంటనే చేపట్టాలని కోరారు. సమస్య ఎక్కడైన తలెత్తితే జెసి, ఆర్డీవో దృష్టికి తేవాలన్నారు. మిషన్ భగీరధ పనులు పూర్తి చేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.సత్యనారాయణరెడ్డి, ట్రైనీ కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఆర్డీవో రవి, మిషన్ భగీరధ ఎస్‌సి విజపాల్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ఈ రమణ, ఈఈలు, డిప్యూటి ఈఈలు, కాంట్రాక్టర్లు, ఎఈలు పాల్గొన్నారు.