నల్గొండ

అన్నపూర్ణ తెలంగాణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతపల్లి, ఏప్రిల్ 26: కోటి ఎకరాలకు సాగునీరందించి రాష్ట్రాన్ని అన్నపూర్ణ తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. గురువారం మండలంలోని మాల్‌లో ఊరె యాదయ్య గార్డెన్‌లో జరిగిన మాల్ మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల సంక్షేమానికి టీఆర్‌యస్ ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తుందన్నారు. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ ప్రతీ ఎకరా బంజరు భూమిని మాగాణిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు శ్రేయస్సు కోసం బడ్జెట్‌లో 25వేల కోట్లను కేటాయించి, 12వేల కోట్లను బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకోవడం జరిగిందన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులకు సాగు పెట్టుబడి కోసం ఎకరాకు 4వేలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ప్రభుత్వం గిడ్డంగులను నిర్మించిందన్నారు. మార్కెట్‌ను లాభాల బాటలో నడిపించేందుకు పాలక వర్గం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతనంగా నియామకమైన మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రావు, వైస్ చైర్మన్ భూపాల్, ఏడీయం ఎంఏ.అలీం, మార్కెట్ కార్యదర్శి చంద్రశేఖర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ విద్యాసాగర్‌రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.