నల్గొండ

భగీరథ పనులను అడ్డుకొన్న అఖిలపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, ఏప్రిల్ 26: మిషన్ భగీరధ పధకంలో భాగంగా కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో చేపట్టిన ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులను గురువారం అఖిలపక్ష నాయకులు అడ్డుకొన్నారు. కోదాడ డియస్‌పి సుదర్శన్‌రెడ్డి ఆద్వర్యంలో పోలీసుల బందోబస్తు మద్య ఓవర్‌హెడ్ ట్యాంక్ పనులను జెసిబిలతో చేపట్టగా జెసిబి పనిచేయకుండా అఖిలపక్ష నాయకులు అడ్డంపడ్డారు. పోలీసులు అఖిలపక్ష నాయకులను అక్కడినుండి తొలగించి పనులను కొనసాగించేందుకు ప్రయత్నించిన సమయంలో స్ధానిక ఎమ్మెల్యే నలమాద పద్మావతి ఉత్తమ్‌రెడ్డి బాలుర హైస్కూల్‌కు వచ్చి పోలీసు, రెవిన్యూ అధికారులతో మాట్లాడి పనులను నిలుపుచేయాలని కోరారు.
జిల్లా పరిషత్ అనుమతిలేకుండా జిల్లా పరిషత్‌కు చెందిన బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మిషన్ భగీరధ ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం ఏలా చేపడతారని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అధికారులను ప్రశ్నించారు. దీంతో తాత్కాలికంగా పనులను నిలుపుచేశారు. బాలుర హైస్కూల్‌లో మిషన్ భగీరధ ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం మొదటినుండి వివాదాస్పదం అయింది. ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్న స్ధలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని అఖిలపక్షనాయకులు, విద్యార్ధులు, యువకులు, క్రీడాకారులు డిమాండ్ చేస్తుండగా అధికార పక్షానికి చెందిన మున్సిపల్ ఛైర్‌పర్సన్, కౌన్సిలర్లు మాత్రం 11 వార్డుల ప్రజల దాహార్తిని తీర్చేందుకు ట్యాంక్ నిర్మించాలంటే ఇంతకుమించిన అనువైన స్ధలం మరొకటి లేదని, ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ట్యాంక్ నిర్మిస్తామని వివరిస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఉన్నతాధికారులు పోలీసుల సాయం తీసుకొని అయినా పనులను ప్రారంభించాలని స్ధానిక రెవిన్యూ అధికారులను ఆదేశించడంతో గురువారం తాహాశీల్దార్ శ్రీదేవి, ఇతర అధికారులు జెసిబితో భగీరధ వాటర్‌ట్యాంక్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అఖిలపక్షాలకు చెందిన నాయకులు మేకల శ్రీనివాసరావు, కుక్కడపుప్రసాద్, బషీర్, షమ్మి, పందిరి నాగిరెడ్డి, మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్ తెప్పని శ్రీనివాస్, కుడుముల లక్ష్మినారాయణ, కొల్లు వెంకటేశ్వర్‌రావు, పంది తిరుపయ్య, ముత్యాలు, గంధం యాదగిరి, భాజాన్ తదితరులు పనులను అడ్డుకొని నిరసన ప్రకటించారు. పాఠశాల నిర్వహణకు దాత ఇచ్చిన స్ధలాన్ని ఇతర ప్రయోజనాల కొరకు ఎలా ఉపయోగిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
అన్నివర్గాల ప్రజలు పాఠశాల ఆవరణలో వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నందున ప్రత్యామ్నాయస్ధలాన్ని చూసుకోవాలని వారు అధికారులను కోరారు. అఖిలపక్ష నాయకులు అడ్డుకొన్నా సాయంత్రం పోలీసుబందోబస్తు మద్య ట్యాంక్ నిర్మాణ పనులు కొనసాగడం విశేషం.