నల్గొండ

రైతుబంధుతో తీరనున్న రైతుల కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, మే 17: తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో రైతుల కష్టాలు తీరనున్నాయని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నియొజకవర్గ ఇంచార్జీ కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు బంధు చెక్కులు, బుక్కుల పంపిణీ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కరీంపాష, ఎంపీపీ రజితావెంకట్‌రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో 24గంటల విద్యుత్, రైతుబంధు, రైతుభీమా, పంట రుణాల మాఫీ ఉందని గుర్తు చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ ఎడారిగా మారిందని, స్వరాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లే అయినా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తుందన్నారు. పలు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ ముందుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బకరం వెంకన్న, మండల యువజన సంఘం అధ్యక్షుడు జి.పరమేష్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు నారబోయిన బిక్షం, నాయకులు వంగాల సహదేవ్, ఉప సర్పంచ్ యాదయ్య, రైసస కో ఆర్డినేటర్ జి.వెంకటయ్య, లింగస్వామి, యాదగిరిరెడ్డి, నర్సిరెడ్డి, ఎంపీటీసీ మల్లేష్‌గౌడ్, సైదిరెడ్డి, సైదులు, నర్సిరెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

చెక్కుల పంపిణీపై కలెక్టర్ సమీక్ష
నల్లగొండ రూరల్, మే 17: జిల్లాలో రైతుబంధు కార్యక్రమం, పట్టాదారు పాసు పుస్తకాలపై జిల్లా అధికారులు, బ్యాంకర్లతో గురువారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ మండలాల వారీగా ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించారు. చెక్కుల పంపిణీ తీరు నివేదికలు, ఫిర్యాదులపై చర్చించారు. టోల్ ఫ్రీ నెంబరుకు 25 ఫిర్యాదులొచ్చాయని, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు వాట్సాప్, లేఖల రూపంలో సంబంధిత తహసీల్దార్‌లకు పరిష్కారం కోసం పంపుతున్నట్లు తెలిపారు. నిలిపివేయాల్సిన చెక్కుల వివరాలను తహసీల్దార్లు, వ్యవసాయాధికారులకు తెలపాలని, తక్కువ డబ్బులు వచ్చిన చెక్కుల స్థానంలోకొత్త చెక్కులను పంపిణీ చేసి పాత చెక్కులను రైతుల నుంచి తీసుకోవాలన్నారు. ఆర్‌ఎఫ్‌ఆర్ చెక్కుల పంపిణీ ఆక్విటెన్స్ రిజిష్టర్రులో ప్రత్యేకంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో 260 కోట్ల విలువ గల చెక్కులు పంపిణీ చేశామని, రైతులకు నగదు చెల్లింపును వేగవంతం చేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు. ఈసమావేశంలో డీఆర్‌వో ఖీమ్యానాయక్, కలెక్టరేట్ అధికారి మోతీలాల్, సూపరిండెంట్ చంద్రవదన, తబిత, తదితరులు పాల్గొన్నారు