నల్గొండ

అసమ్మతికి ఆజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 26: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ను నియమించడం కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గీయుల్లో అసమ్మతిని రాజేసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో బూడిద భిక్షమయ్యగౌడ్ వైఖరితోనే తాను భువనగిరి ఎంపీగా ఓడిపోయానంటూ ఇటీవలే ఎమ్మెల్సీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాహటంగా బూడిదపై తన వ్యతిరేకతను వెల్లడించి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటువంటి వారిని ప్రొత్సహించడం పార్టీకి నష్టదాయకమంటు విమర్శించారు. భూదందాలు, కేసులున్న బూడిదకు డీసీసీ అధ్యక్ష పదవిగాని, వచ్చే ఎన్నికల్లో టికెట్‌గాని ఇవ్వరాదంటు రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అంతకుముందు సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ అనుచరుడైన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను బూడిద స్థానంలో ఈ దఫా డీసీసీ అధ్యక్షుడిగా నియామించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో తాము గతం నుండి కూడా వ్యతిరేకిస్తున్న బూడిద భిక్షమయ్యగౌడ్‌కే మరోసారి ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసి సారధ్య బాధ్యతలు అప్పగించడం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మింగుడుపడనిదిగా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ గత కొంతకాలంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డీఆర్‌ఎస్ దూకుడుకు దీటుగా పార్టీ కార్యక్రమాలను తమదైన శైలీలో నడిపిస్తున్నారు. సీఎం కేసీఆర్ రాజకీయంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌ను టార్గెట్ చేసినా తమ దూకుడు తగ్గించకుండా కేసీఆర్ పాలనపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ హత్యోదంతంపైన, వెంకట్‌రెడ్డి శాసన సభ్యత్వ రద్ధు సందర్భాల్లో సైతం కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ నాయకులను ఒక్కవేదికపైకి తెచ్చి పార్టీకి మైలేజ్ తేవడంలో సఫలీకృతులయ్యారు. రాహుల్‌గాంధీ వద్ధ సైతం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఈ సందర్భాల్లో ప్రాధాన్యత పెరిగింది. ఐనప్పటికీ తాము వ్యతిరేకించిన బూడిదను డీసీసీ సారధిగా కాంగ్రెస్ అధిష్టానం మరోసారి ఎంపిక కాకుండా చేయడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ విఫలమవ్వగా తన వర్గీయుడిని మరోసారి డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకోవడంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ సఫలమయ్యారు. తాము వ్యతిరేకించిన బూడిదనే మళ్లీ డిసిసి అధ్యక్షుడైనందునా రానున్న పంచాయితీ, సాధారణ ఎన్నికల్లో తమకు ఇబ్బంది ఏర్పడవచ్చన్న అసంతృప్తి కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గీయుల్లో వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో గతంలో మాదిరిగానే గ్రూపుల రచ్చ మునుముందు కూడా కొనసాగడం తధ్యంగా కనిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

బీబీనగర్‌లో కేంద్ర బృందం పర్యటన
బీబీనగర్, మే 26: మండలంలోని వివిధ గ్రామాల్లో 2008 నుండి 2018 వరకు జరిగిన బీఆర్‌జీఎఫ్ నిధులతో చేపట్టిన పనులను కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారి జోసెఫ్‌నూరజ్ తులసి సందర్శించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కేంద్రం కేటాయించిన నిధులు దుర్వినియోగం కాకుండా అభివృద్ధి ఎలా జరిగిందని పరిశీలించారు. అనంతరం మిగితా పనుల కోసం కేంద్రం బీఆర్‌జీఎఫ్ నిధులు కేటాయించేందుకే ఈ పరిశీలన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట నల్లగొండ జిల్లా సీనియర్ అసిస్టెంట్ పద్మనాభం, ఎంపీడీవో శ్రీవాణి, పంచాయితీరాజ్ ఏఈ శివప్రసాద్, పంచాయితీ కార్యదర్శి సలీమ్ తదితరులు పాల్గొన్నారు.