నల్గొండ

ఎరువుల ధరల బరువు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూన్ 18: నేలతల్లిని నమ్ముకొని జీవిస్తున్న అన్నదాతలకు పంటలు సాగుచేయడం ఏటేటా భారంగా పరిణమిస్తోంది. సాగు వ్యయం పెరుగుతుండటం.. అందుకు అనుగుణంగా పండించిన పంటలకు ధరలు పెరగకపోవడంతో ఆరుగాలం శ్రమించిన ఫలితం లేకుండా పోతోంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పథకం కింద ఎకరాకు నాలుగు వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించడంతో ఆనందంగా ఉన్న రైతాంగం ఆదును చూసి ఎరువుల కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతంగా పెంచేయడంతో మరో భారం తప్పదంటూ నిట్టూరుస్తున్నారు. పంటల సాగుకు పెట్టుబడుల కోసం నానా తిప్పలు పడే రైతాంగానికి సీజన్ ఆరంభంలోనే కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో పెట్టుబడి భారం మరింత పెరుగుతోంది. సీజన్ ప్రారంభానికి ముందే ఎరువుల కంపెనీలు అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఒక్కసారిగా పెంచేశాయి. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న రైతులు ఈ ధరల పెరుగుదల తమకు మోయలేని భారమని వాపోతున్నారు.
వందకుపైగా పెరిగిన ధరలు
కాంప్లెక్స్ ఎరువుల ధరలు గత ఏడాదితో పోల్చితే బస్తాకు వంద రూపాయలకు పైగా ధరలను కంపెనీలు పెంచాయి. గత ఏడాది డీఎపీ బస్తా రూ.1,081 ఉండగా ఈసారి రూ.1.215కు పెరిగింది గతేడాదితో పొల్చితే బస్తాకు రూ.140 వరకు ధర పెరిగిట్లుయింది. అదేవిధంగా 2020013రకం కాంప్లెక్స్ ఎరువు గతేడాది రూ.873 ఉండగా ఈసారి రూ.930కి చేరింది. 282808రకం గతేడాది రూ.1122 ఉండగా రూ.1,240కి, 143514రకం గత ఏడాది రూ 1,122 ఉండగా ఈసారి రూ.1,240వరకు పెరిగింది. అంతర్జాతీయంగా దిగుమతి చేసుకునే ఈ కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు అన్ని ఒకేసారి పెంచేయడంతో రైతులు గగ్గొలు పెడుతున్నారు. పంటల సాగు సమయంలో అధికంగా ఉపయోగించే కాంప్లెక్స్ ఎరువుల పెరగుదలతో ప్రతి రైతుపై భారం పడుతోంది.
జిల్లా రైతాంగంపై రూ.12 కోట్ల అదనపు భారం
కాంప్లెక్స్ ఎరువుల ధరల పెరుగుదల వల్ల జిల్లా రైతాంగంపై అదనంగా సుమారు 12కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం జిల్లాలో ఈ సీజన్‌లో లక్షా 85వేల హెక్టార్‌లలో రైతులు వివిధ పంటలను సాగుచేస్తున్నారు. పంటల దిగుబడులు పెరగాలనే ఆశతో రైతులు సాధారణగా దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులను అధికంగా వినియోగిస్తుంటారు. రమారమిగా ఎకరాకు రెండు బస్తాల చొప్పున రైతులు కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తుంటారు. ఈలెక్కన జిల్లా రైతులపై అదనంగా 12కోట్ల భారం ఎరువుల రూపంలో అధిక భారం పడుతుండటంతో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. ప్రభుత్వం రైతుబందు కింద ఎకరాకు రూ.4వేలు ఇచ్చిన పంట పెట్టుబడుల కోసం బ్యాంకు రుణాలపై ఇప్పటికే స్పష్టత లేకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పంటలసాగులో రైతులు ప్రధానంగా ఉపయోగించే ఎరువుల ధరలను అంతర్జాతీయస్ధాయిలో ఉన్న ధరలకు అనుగుణంగా నిర్ణయించడం తగదని పలువురు రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. వివిధ వర్గాల వారికీ అనేక రాయితీలు కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమైన వ్యవసాయరంగానికి ఇరుసుగా ఉపయోగించే ఎరువుల ధరలను పెరగకుండా నియంత్రించాలని కోరుతున్నారు.
మరోసారి ధరల పెరుగుదలకు అవకాశం
కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఈనెలఖారు లోగా మరోమారు పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఎరువుల వ్యాపారులు చెబుతున్నారు. ఈసారి బస్తాకు రూ.40 నుంచి రూ.50 మేరా ధరలు పెరుగుతాయని, సంబంధిత కంపెనీలు ఈమేరకు తమకు సంకేతాలు ఇచ్చినట్లుగా వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పెంచిన ధరలతో గగ్గొలు పెడుతున్న రైతులు మరోసారి ధరలు పెంచితే ఆందోళనలకు సిద్దమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి.

కదలని కల్యాణ లక్ష్మి
* భారీగా దరఖాస్తుల పెండింగ్

నల్లగొండ, జూన్ 18: పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కొండంత అండగా నిలుస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాల అమలులో సాగుతున్న జాప్యం లబ్ధిదారులకు సకాలంలో పథకం సహాయం అందకుండా ఎదురుచూపులు పెట్టిస్తుంది. గతంలో పెళ్లి తర్వాతా అందించే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ల సహాయం ఇప్పుడు పెళ్లికి ముందు కూడా ఇచ్చే వెసులుబాటును ప్రభుత్వం కల్పించినా అధికార యంత్రాంగం దరఖాస్తుల పరిశీలన, మంజూరీ ప్రక్రియలలో చేస్తున్న తాత్సార్యంతో పెళ్లి తర్వాతా కూడా నెలల తరబడి లబ్ధిదారులు కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు చేయాల్సివస్తుంది. నల్లగొండ జిల్లాలో 4036దరఖాస్తులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న తీరు సమస్య తీవ్రతను చాటుతుంది. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాల కింద ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బిసి, ఈబిసి వర్గాల పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం పెంచిన మొత్తం మేరకు 1లక్ష 116రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తుంది. కల్యాణ లక్ష్మి సహాయం కోసం దరఖాస్తుదారులు మీసేవా కేంద్రాల ద్వారా అవసరమైన దృవపత్రాలతో దరఖాస్తులు అందించాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి పెళ్లి రిజిస్ట్రేషన్ పత్రాలు, కుల దృవీకరణ ఆదాయం, నివాస దృవీకరణ, గ్రామ కార్యదర్శి దృవీకరణ, బ్యాంకు ఖాతా పత్రాలతో దరఖాస్తులు చేసుకోవాలని, వీటి జీరాక్స్‌తో పాటు వివాహామైన జంటల పెళ్లి చిత్రాలను తహశీల్ధార్‌లకు నేరుగా అందించాలి. తహశీల్దార్ సదరు దరఖాస్తులను విచారించి ఆర్హత ఉన్న వాటిని స్థానిక ఎమ్మెల్యే ఆమోదం కోసం పంపించి తదుపరి వాటిని ఆన్‌లైన్ చేసి ఆర్డీవోల ఆమోదంతో పథకం సహాయం మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో వేస్తునే సంబంధిత చెక్కులను ఎమ్మెల్యేల ద్వారా అందించే విధానాన్ని పాటిస్తున్నారు. ఇటీవల భూరికార్డుల శుద్ధీకరణ, రైతుబంధు పథకం అమలు, రైతుబీమా వంటి పథకాల నేపధ్యంలో రెవెన్యూ యంత్రాంగం బిజీగా ఉండటంతో కల్యాణ లక్ష్మీ దరఖాస్తులు భారీగా పెండింగ్‌లో పడటం దరఖాస్తుదారులను నిరాశ పరుస్తుంది.
సహాయం మంజూరుకై ఎదురుచూపులు
కల్యాణలక్ష్మీ కటాక్షం కోసం జిల్లాలో 4036దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా పథకం సహాయం కోసం దరఖాస్తుదారులు అధికారుల చుట్టు తిరుగుతున్నారు. పెండింగ్ దరఖాస్తుల్లో 1841తహశీల్ధార్‌ల స్థాయిలో, 764ఎమ్మెల్యేల స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్డీవో స్థాయిలో 410, ట్రెజరీలో 1021దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.