నల్గొండ

ఎస్సీ ఎస్టీ కేసులను వేగంగా పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, జూన్ 21: ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ, పరిష్కారాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు పోలీస్, న్యాయవ్యవస్థలు చొరవ తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ కేసుల సమీక్షా సదస్సులో ఆయన మాట్లాడుతు జిల్లాలో పోలీస్ శాఖ ఎస్సీ, ఎస్టీ కేసుల ఇప్పటిదాకా చూపిన పనితీరు అభినందనీయమన్నారు. గతంలో ఉన్నట్లుగా కులవివక్షత నేడు లేకపోయినప్పటికి ఆ జాఢ్యం ఇంకా పూర్తిగా రూపుమాసిపోలేదన్నారు. భారత రత్న, డాక్టర్ బిఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యంగ స్ఫూర్తి, హక్కులను అనుసరించి ఎస్సీ, ఎస్టీలకు చట్టపరమైన రక్షణ, భద్రత, ప్రొత్సాహం ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాల కర్తవ్యమన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కమిషన్ కులనిర్మూలనకు ఎస్సీ, ఎస్టీలను చైతన్యపరిచేందుకు వారిని అభివృద్ధివైపు నడిపించేందుకు పోలీస్ శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ప్రతినెల 30న పౌరహక్కుల దినోత్సవం నిర్వహించి గ్రామంలో అన్ని కులాల ప్రజలను ఒకచోట సమావేశపరిచి కులవివక్షత నిర్మూలనపై అవగాహాన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రంగానాథ్ మాట్లాడుతు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసుల పురోగతిని, శాఖపరంగా ప్రత్యేకంగా కుల వివక్షత నిర్మూలనకు చేపట్టిన చైతన్య కార్యక్రమాలను వివరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణ ఎస్సీ, ఎస్టీ చట్టాలు, కేసుల పరిష్కార చర్యలపై అవగాహాన కల్పించారు.