నల్గొండ

ఘనంగా యోగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, జూన్ 21: జిల్లాకేంద్రంలో గురువారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా ట్రస్టుల ఆధ్వర్యంలో, వివిధ పాఠశాలల్లో, ఇండోర్ స్టేడియంలో, కళాశాలల్లో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాసనాలు వేశారు. భారత్ స్వాభిమాన్ ట్రస్టు, పతంజలి యోగా సమితి, ఆర్యసమాజం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక బీట్ మార్కెట్ ప్రాంగణంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా యోగా సాధకులు, యోగా గురువులు వివిధ ఆసనాలు వేసి యోగా తరగతులు నిర్వహించారు. ఈసందర్భంగా యోగా గురువులు మాట్లాడుతూ ఆరోగ్య భారతదేశంగా, పరిశుభ్ర భారతదేశంగా స్వాతంత్య్ర స్వావలంబన, అవినీతి రహిత భారత్‌గా దేశాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో యోగా గురువు రాందేవ్‌బాబా స్వాభిమాన్ ట్రస్టును ఏర్పాటు చేశారని, అనేక ప్రాంతాల్లో యోగా శిక్షణా తరగతులు, ఆధ్యాత్మిక సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. యోగాతో ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చన్నారు.ఈకార్యక్రమంలో ఆర్డీవో వెంకటాచారి, యోగా గురువులు జొన్నలగడ్డ గోపాల్‌రెడ్డి, కరుణాకర్ యోగాచార్యులు, నాగులపల్లి శ్యాంసుందర్, ఎంవి.గోనారెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ అమరేందర్‌రెడ్డి, వైద్యులు పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో రిజిష్ట్రారు ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడుతూ ప్రస్తుత వేగవంతమైన జీవన విధానంలో అందరూ ఒత్తిడికి గురవుతున్నారని, ఒత్తిడి నుండి బయటపడేందుకు, మానసిక ప్రశాంతతకు, ఆరోగ్యమైన శరీరానికి యోగా ఎంతో అవసరమన్నారు. అదేవిధంగా పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో రిటైర్డు ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, యారాల ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ వెంకటరమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

నల్లగొండ, జూన్ 21: పోలీస్ ఉద్యోగాల సాధన కోసం పోటీ పడుతున్న నిరుద్యోగ యువత జిల్లా పోలీస్ శాఖ అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని తమ ఉద్యోగ సాధనలో విజయవంతం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న యువతీయువకులకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీకి వరుస నోటిఫికేషన్లు వేస్తుందని యువత వీలైనన్ని ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రయత్నించాలన్నారు. తెలంగాం సాధన కోసం పరితపించిన జయశంకర్ సార్ వర్ధంతి రోజు ఉచిత ఉద్యోగ శిక్షణ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జయశంకర్ సార్ చూపిన బాటలో నీళ్లు, నిధులు, ఉద్యోగాల సాధన కోసం తెలంగాణను సీఎం కెసిఆర్ నాయకత్వంలో సాధించుకుని ఆయా రంగాల్లో వేగంగా ముందుకెలుతున్నామన్నారు. యువతకు మునుముందు తెలంగాణలో మునముందు మరిన్ని ఉద్యోగ, ఉపాధి మార్గాలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ రంగనాథ్, నియోజకవర్గ టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.