నల్గొండ

బంగారం కొనుగోళ్ళతో దుకాణాల కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, మే 9: అక్షయ తృతీయ సందర్భంగా మండల ప్రజలు సోమవారం బంగారాన్ని, అభరణాలను కొనుగొలు చేశారు. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే లక్ష్మీదేవి తమ ఇంట సిరులపంట కలిగిస్తుందని నమ్మకం. అందుకే అక్షయతృతీయ రోజున కొద్దోగొప్పో బంగారాన్ని కొనుగోలు చేస్తామని బంగారం దుకాణానికి వచ్చిన వినియోగదారు అంటున్నారు. బంగారం అంటే ప్రతి ఒక్కరికి మక్కువే..అందులోను మహిళలకు అందమైన ఆభరాణాలైతే మరీ మక్కువ. అందునా ‘అక్షయ తృతీయ’ సందర్భంగా బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే సిరులు కలిసి వస్తాయనే నమ్మకంతో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఉత్సుకతను చూపించారు. అక్షయ తృతీయ రోజుకున్న ప్రాధాన్యతను వస్తున్న ఆదరణను చూసి అక్షయ తృతీయ ఆదరణకు విస్తృత ప్రచారం జరుగడంతో అందుకు ప్రాదాన్యత పెరిగినది. ప్రతి అక్షయ తృతీయ రోజున బంగారాన్ని, ఆభరణాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరిచారు ప్రజలు. ఈఅక్షయ తృతీయ రోజున మండల కేంద్రంలో బంగారం దుకాణాల్లో బంగారం, ఆభరణాలను ప్రజలు కొనుగోలు చేసేందుకు రావడంతో బంగారు దుకాణాలు కిటకిటలాడాయి. బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు స్థానికులేకాకుండా మండలంలోని పలు గ్రామాలకు చెందినవారు ఇతర మండలాలకు చెందిన వారు పెద్దఎత్తున వచ్చి బంగారు దుకాణాల్లో బంగారాన్ని ఆభరణాలను కొనుగొలు చేశారు. హారారాలను గొలుసులను మహిళలు యువతులు మెడలో వేసుకుని మురిసిపోయారు. ఉన్నత కుటుంబానికి చెందిన వారు అందమైన ఆభరణాలు, బంగారాన్ని కొనుగోలు చేయగా బంగారం ధర ఎక్కువగానే ఉన్నప్పటికినీ తమ ఇళ్ళంతా బంగారమయం కావాలని ఆకాంక్షిస్తూ బంగారాన్ని కొనుగోలు చేశారు. మద్య తరగతి కుటుంబానికి చెందిన వారు వారికి తోచినంతగా బంగారాన్ని కొనుగోలు చేశారు. వివాహాలకు బంగారాన్ని, ఆభణాలను కొనుగోలు చేసే వారు కూడా దుకాణాలకు రావడంతో నూతన వధువులు వారి బంధువులతో కిటకిటలాడాయి.

కాల్వపల్లిలో సంపూర్ణ మద్యపాన నిషేదం
గుర్రంపోడ్, మే 9: మండలంలోని కాల్వపల్లి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేదానికి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ మారం గోపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం గ్రామంలో ఏర్పాటు చేసిన తీర్మాణ సభలో వార్డు సభ్యులు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలంగా కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నామన్నారు. భవిష్యత్తులో బెట్లు షాపులలో మద్యం అమ్మితే యజమనులపై చర్యలు తీసుకోవాలని నాంపల్లి ఎక్సైజ్ సిఐ వెంకట్‌రెడ్డికి, స్థానిక ఎస్‌ఐ బీసన్నకు, మండల తహశీల్ధార్ శ్రీరాములుకు వినతిపత్రం అందజేశారు. ఈ వినతిపత్రం అందజేశినవారిలో ఉప సర్పంచ్ రాధ, వార్డు సభ్యులు కరీమ్, యాదగిరిరెడ్డి, గౌరమ్మ, నారాయణరెడ్డి, యాకూబ్‌మియా, ఆనంద్‌రెడ్డి, శ్రీను, యాదయ్య, వెంకటయ్య, వెంకయ్య, శ్రీను, మహిళా సంఘాల లీడర్లు ముత్యాలమ్మ, అచ్చమ్మ, రాధమ్మ, విమల తదితరులు పాల్గొన్నారు.