నల్గొండ

తెలంగాణ కళల పరిరక్షణకు కళారాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలెక్టరేట్(నల్లగొండ), మే 10: తెలంగాణ సాంస్కృతిక కళల పరిరక్షణకై ప్రభుత్వం తెలంగాణ కళారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి టౌన్ హాల్‌లో జరిగిన కళారాధన వారోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణకు ప్రత్యేకమైన జానపద, సాంస్కృతిక కళలను కళారాధన వేదిక ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. కళాకారులు తమ కళారూపాలను ఈ వేధిక ద్వారా ప్రదర్శించి తెలంగాణ కళా సంస్కృతులను ముందుకు తీసుకెళ్లాలన్నారు. బాలు బృందం వారి జయజయహే తెలంగాణ నృత్యరూపకం, శ్రవణ్ బృందం కూచిపూడి స్వాగత నృత్యాలతో కళారాధన ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు గడ్డం కాశయ్య బృందం చిందు యక్షగాణం, జాగృతి పోలీస్ బృందం మిషన్ కాకతీయ నృత్య రూపకం, ప్రియాంక కూచిపూడి నృత్యం, క్రాంతి ఇంద్రజాలం, జి.ఉప్పలయ్య ఒగ్గుకతలు ప్రదర్శించారు. వారోత్సవాలలో భాగంగా కూచిపూడి, భరతనాట్యం, జానపద గేయాలు, నృత్య రూపకాలు, ఇంద్రజాలం, మిమిక్రి, మైమ్, గజల్స్, ఖవ్వాలి, చిందు యక్షగాణం, ఒగ్గుకథ వంటి కళారూపాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎజెసి వెంకట్‌రావు, డిఆర్‌వో రవినాయక్, డిఆర్‌డిఎ పిడి అంజయ్య, జెడిఎ నర్సింహ్మరావు, డిఈవో చంద్రమోహన్, ఆర్డీవో వెంకటాచారి, డిపి ఆర్‌వో నాగార్జున, స్టెప్ సిఈవో వేణుగోపాల్‌రావు, పిడి కిరణ్‌కుమార్‌లు పాల్గొన్నారు.