నల్గొండ

నాలుగేళ్లలో ఎనలేని అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 12: తన నాలుగేళ్ల పాలనలో పట్టణ ప్రజల సహకారంతో సూర్యాపేట మున్సిపాలిటీని ఏనలేని అభివృద్ది చేసి జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గురువారం ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 2014లో చైర్‌పర్సన్‌గా తాను బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి నేటి వరకు పట్టణ సమగ్రాభివృద్ధి కోసం శ్రమించినట్లు తెలిపారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ద్వారా భారీగా నిధులు మంజూరు చేయించి అభివృద్ది పనులు చేపట్టామన్నారు. గడిచిన నాలుగేళ్లలో రూ.45.71కోట్లతో పట్టణంలోని అన్ని వార్డుల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పట్టణంలో పారిశుద్యవ్యవస్థను మెరుగుపరిచేందుకు ఉండమ్మ బొట్టు పెడతా, మనవీధి - మనవిధి లాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రెవెన్యూ విభాగ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. తడి, పొడిచెత్తల సేకరణ కోసం ఇంటింటికి చెత్తబుట్టలు పంపిణీ చేసినట్లు చెప్పారు. స్వచ్చ్భారత్‌లో భాగంగా 100శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసి ఓడీఎఫ్ పట్టణంగా ఘనతసాధించామన్నారు. ప్రత్యేక పారిశుద్య చర్యలను చేపట్టి జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్‌లో వరుసగా రెండేళ్లు ర్యాంకు సాధించి సూర్యాపేట కీర్తిని దేశవ్యాప్తం చేసినట్లు తెలిపారు. పట్టణ ప్రజలు, పాలకవర్గ సభ్యులు, అధికారుల సహకారంతోనే నాలుగేళ్ల పాలన విజయవంతంగా కొనసాగించినట్లు చెప్పారు. అభివృద్ధిలో మున్సిపాలిటీని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

రాజధానికి ‘అవిశ్వాస’ రాజకీయం
- సంతకాలకు కాంగ్రెస్‌కు చేరిన టీఆర్‌ఎస్ అసమ్మతీయుల నోటీస్
- మంత్రి జగదీశ్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోసం ఇరుపక్షాల వెయిటింగ్
కోదాడ, జూలై 12: కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ వంటిపులి అనితపై కాంగ్రెస్ కౌన్సిలర్‌ల అండతో స్వపక్ష సభ్యులే అవిశ్వాసం పెట్టేందుకు చేస్తున్న ముమ్మర ప్రయత్నాలు తుది అంకానికి చేరాయి. టీఆర్‌ఎస్‌కు చెందిన అసమ్మతీయులు గురువారం కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీస్ అందచేస్తారని భావించగా మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసి అవిశ్వాసానికి దారి తీసిన పరిస్థితులను వివరించిన తరువాతనే శుక్రవారం కలెక్టర్‌కు నోటీస్‌ను అందచేయాలని నిర్ణయించి ఒకరోజు వాయిదా వేసుకొన్నట్లు తెలుస్తున్నది. టీఆర్‌ఎస్ ఫ్లోర్‌లీడర్, అసమ్మతి కౌన్సిలర్‌ల నేత పార సీతయ్య నేతృత్వంలో కౌన్సిలర్‌లు హైద్రాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిసేందుకు గురువారం సాయంత్రం తరలివెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. అవిశ్వాస గండం నుండి గట్టెక్కేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి మద్దతును పొందేందుకు చైర్‌పర్సన్ వర్గీయులు కూడా ఆయన్ను కలిసేందుకు హైద్రాబాద్‌లోనే ఉన్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌కు చెందిన ఇరుపక్షాలవారికి సాయంత్రం ఏడున్నర గంటల వరకు మంత్రి జగదీశ్‌రెడ్డి అపాయింట్‌మెంట్ లభించలేదని తెలిసింది. కోదాడ మున్సిపాలిటీ రాజకీయం రాజధానికి చేరడంతో మంత్రి జగదీశ్‌రెడ్డి తీసుకొనే కీలక నిర్ణయం కోదాడలో టీఆర్‌ఎస్ పార్టీ మనుగడకు కీలకం కానున్న పరిస్థితులు కనపడుతున్నాయి. చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్‌తో ముందుగా మాట్లాడుకున్నట్లుగానే టీఆర్‌ఎస్‌కు చెందిన తొమ్మిది మంది అసమ్మతి కౌన్సిలర్లు పార సీతయ్య, పాలూరి ఈశ్వరీ, గార్లపాటి వీరారెడ్డి, వనపర్తి సోమమ్మ, భూక్యా వాల్యానాయక్, మాళోతు విమల, జమ్ముల లావణ్య, మానస, కోట మధుసూదన్‌రావులతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన తుమ్మలపల్లి భాస్కర్‌రావు సంతకాలు చేసిన అవిశ్వాస తీర్మానం నోటీస్‌ను బుధవారం రాత్రి కాంగ్రెస్ నేతకు అప్పగించినట్లు సమాచారం. అసమ్మతి వర్గంలో ఉన్నట్లుగా భావిస్తున్న కెఎల్‌ఎన్ ప్రసాద్, కమదన మాధవి, షేక్ షఫీ సంయమనం పాటిస్తున్నట్లుగా తెలుస్తున్నది. వాస్తవంగా గురువారం తొమ్మిది మంది కాంగ్రెస్ కౌన్సిలర్‌లు అసమ్మతి నోటీస్‌పై సంతకాలు చేయాల్సి ఉండగా వారిలో ముగ్గురు సభ్యులు మధ్యస్తంగా ఉన్నారని స్థానిక నాయకులు భావించడంతో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సమక్షంలోనే నోటీస్‌పై అందరూ సంతకాలు చేసేలా వ్యూహరచన చేశారు. దానిలో భాగంగానే ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి గురువారం సాయంత్రం కోదాడకు చేరుకున్న తరువాత శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే సమక్షంలో తొమ్మిది మంది కౌన్సిలర్ల సంతకాలు చేయించి తదుపరి అందరూ కలిసి కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌కు నోటీస్‌ను అందచేయాలనేది ఇప్పటివరకు వున్న వ్యూహంగా కనపడుతున్నది. తెలుగుదేశంకు చెందిన దండ వీరభద్రం, ఉప్పుగండ్ల సరోజ విశ్వాసం, అవిశ్వాసానికి అతీతంగా మధ్యస్తంగా వుండాలని నిర్ణయించుకొన్నారు. అవిశ్వాస తీర్మానానికి అవసరమైన సభ్యుల సంతకాలను అసమ్మతీయులు సేకరించే అవకాశం ఉన్నందున శుక్రవారం నోటీస్ కలెక్టర్‌కు చేరుతుందా? లేదా కంచికా? అనేది ప్రస్తుతం స్థానికంగా ఉత్కంఠతను కలిగిస్తున్న అంశం.