నల్గొండ

అంగన్‌వాడీలకు సముచిత స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోత్కూరు, జూలై 12: రాష్ట్రంలో అంగన్‌వాడీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో మంజూరైన మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన సందర్శించి నూతనంగా నియమితులైన ముగ్గురు అంగన్‌వాడీ టీచర్లు, ఏడుగురు ఆయాలకు నియామక పత్రాలు అందజేయడంతో పాటు అంగన్‌వాడీలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సోలార్ దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. తదుపరి ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కిషోర్ మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాలు ఆర్థికభారంతో ఐసీడీఎస్ ప్రాజెక్టును ఎత్తివేశాయని, తెలంగాణ రాష్ట్రంపై ఈ పథకంతో సుమారు 2 వేల కోట్ల భారం పడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలు, చిన్నారుల సంక్షేమంపై చిత్తశుద్ధితో ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఎలాంటి ఆందోళనలు చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గమనించి అంగన్‌వాడీల వేతనాలు పెంచారని తెలిపారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం అయ్యేలా చూడాలని సూచించారు. అంగన్‌వాడీలు బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలతో సమస్యలు పరిష్కారం కావని, మహిళలు, ఆడ పిల్లల సంక్షేమానికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేసీఆర్ కిట్‌లు, తల్లిబిడ్డల సంక్షేమం కోరుతూ మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు చెల్లించడం లాంటి బృహత్తర పథకాలు చేపడుతూ రాష్ట్రంలో అడబిడ్డలకు భరోసా కల్పిస్తున్నారన్నారు. అనంతరం పీడీ శారద, రీజినల్ ఆర్గనైజర్ సువర్ణరెడ్డిలు మాట్లాడుతూ అంగన్‌వాడీ నియామకాలు పారదర్శకంగా జరిగాయని, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐదు మోడల్ కేంద్రాలు మంజూరైనట్లు తెలిపారు. అంగన్‌వాడీలు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్ సీహెచ్.మహేంద్రనాథ్, ఎంపీపీ ఓర్సు లక్ష్మి, జడ్పీటీసీ సీహెచ్.వరలక్ష్మి, ఎంపీడీవో ఉమాదేవి, సర్పంచ్ పిచ్చయ్య, ఎంపీటీసిలు జయశ్రీ, ప్రమీల, శ్రీను, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
వరదనీటి ప్రవాహానికి మురుగుకాల్వలు ఏర్పాటు చేయాలి
మండల కేంద్రంలోని ఎస్టీవో కార్యాలయం నుండి హీరో షోరూం వరకు గల ప్రధాన రహదారిపై నిలిచిన వరదనీటి ప్రవాహానికి మురుగు కాల్వలు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు గాలిబ్, లింగయ్య, బాలయ్య, రాజు, రజియా, రమాదేవి గురువారం ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. వర్షం కురిసిన సమయంలో రహదారి అంతా వర్షపునీరు నిలిచి ఇండ్లలోకి వస్తుండటంతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు వాపోయారు.

కల్యాణలక్ష్మితో నిరుపేదలకు చేయూత
- నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
రామన్నపేట, జూలై 12: రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు చేయూతనివ్వడానికే రాష్ట్రం ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలులోనికి తీసుకవచ్చిందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 40మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను గురువారం మండల కేంద్రంలో పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి అన్నివర్గాల సంక్షేమానికి కట్టుబడి పథకాలను అమలు చేస్తుందని అన్నారు. కళ్యాణలక్ష్మీ పథకం నిరుపేద కుటుంబాలకు వరంగా మారిందన్నారు. ఎందరో ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ పథకం ఆత్మస్థైర్యాన్ని నింపిందన్నారు. అనేక కుటుంబాలకు ఆసరాగా నిలిచిందని అన్నారు. అర్హులైనవారందరు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులు 40మందికి మంజూరైన రూ.38లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ, జడ్పీటిసి జినుకల వసంత, తహశీల్దార్ రవిందర్‌సాగర్, ఎంపీడీవో జానకిరెడ్డి, ఎంపీటీసీలు ఆకవరపు మధుబాబు, పున్న వెంకటేశం, చాడ వెంకట్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ గుత్తా నర్సిరెడ్డి, మార్కెట్ కమిటీ వైఎస్ చైర్మన్ బందెల రాములు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పూస బాలనర్సింహ, పోచబోయిన మల్లేషం, బొడిగె చంద్రకళ, రాపోలు శివరంజని పాల్గొన్నారు.