నల్గొండ

హరితహారం కార్యక్రమాన్ని సక్సెస్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలగిరి, ఆగస్టు 13: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన నాలుగవ విడత హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై విజయవంతం చేయాలని ఎంపీపీ కొమ్మినేని సతీష్‌కుమార్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు. ఈకార్యక్రమంలో సీహెచ్‌వో బిక్షునాయక్, సూపర్‌వైజర్ రామచంద్రు, హెల్త్‌అసిస్టెంట్‌లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రిలో శివకేశవుల పూజలు
యాదగిరిగుట్ట, ఆగస్టు 13: యాదాద్రి లక్ష్మినరసింహాస్వామి ఆలయంలో శ్రావణ సోమవారం భక్తుల రద్ధీ పెరిగింది. శ్రావణ సోమవారం సందర్భంగా స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారి నిత్య కల్యాణోత్సవం, గజవాహన సేవ, వెండి జోడి సేవలను శాస్తయ్రుక్తంగా నిర్వహించారు. అష్టోత్తర పూజలు, సహస్రనామార్చనల్లో, నిత్య కల్యాణోత్సంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అటు యాదాద్రిపై వేంచిసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శివకేశవుల పూజలతో, దర్శనాలతో భక్తులు పులకించారు. దేవసాన్థం 25రోజుల హుండి ఆదాయ లెక్కింపును సోమవారం నిర్వహించారు.
హుండీ ల్కెంపు
ఆదాయం 58లక్షల 25వేల 814రూపాయలుగా రాగా 20గ్రాముల బంగారం, 1కిలో 400గ్రాముల వెండి లభించింది. రోజువారి ఆదాయం 10లక్షల 64,373రూపాయలుగా వచ్చినట్లుగా ఆలయ ఈవో గీత తెలిపారు.