నల్గొండ

అటవీశాఖ కార్యాలయం ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, ఆగస్టు 14: డివిజన్ కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం రాచకొండ రైతులు ముట్టడించారు. తమ భూములను లాక్కునేందుకు హరితహారం పేరుతో జిమ్మిక్కులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు. అధికారులతో వాగ్వాదం చేస్తూ ఫారెస్ట్ ఆఫీసు ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. రంగారెడ్డి జిల్లా తిప్పాయిగూడెం, ఆరుట్ల, యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం కడీలబావితండా, తుంబావితండాలకు చెందిన రైతులు అటవీశాఖ ఆఫీసును ముట్టడించారు. ప్రభుత్వానికి, అటవీశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దశాబ్దాల కాలంగా సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న భూములను హరితహారం పేరుతో లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సాగు చేస్తూ పొట్ట పోసుకుంటున్న భూములను లాక్కొని బజారున పడవేయవద్దన్నారు. అటవీశాఖ అధికారులతో వత్తిడి చేయించి తమ భూములను లాక్కుంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రైతులు సాగు చేస్తున్న భూములను హరితహారం పేరుతో లాక్కోవాలన్న ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రయత్నాలు కొనసాగిస్తే జరుగబోయే పరిణామాలకు ప్రభుత్వం, అటవీశాఖ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు పగుడాల యాదయ్య, బూర్గు కృష్ణారెడ్డి, ఎండీ. పాషా, కీసరి నర్సిరెడ్డి, కే.సాగర్, మోత్య, శంకర్, కురిమిద్ద లింగయ్య, శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, మందుల బాలకృష్ణ, మైలారం రాములు, ఎర్రోల్ల కృష్ణ, లాలు, భాస్కర్, మారయ్య, నోముల ఎట్టయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.