నల్గొండ

భారీ వర్షాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడిగూడెం, ఆగస్టు 20: గత నాలుగురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఆదివారం రాత్రి భారీ వర్షం నడవడంతో మండలంలోని చెర్వులు, కుం టలు పొంగిపొర్లు తున్నాయి. ఆదివారం రాత్రి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలోని బృందావనపురం, సిరిపురం, వల్లాపురం, త్రిపురవరం, తెల్లబల్లి, రత్నవరంతో పాటు మండలకేంద్రంలోని సారంగేశ్వరుని చెర్వు అలుగులు పోస్తున్నాయి. భారీ వర్షాల దాటికి పంట పొలాలు, పత్తిచేలు నీట మునిగాయి. పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. మండలంలో 720 హెక్టార్‌లలో వరిపంటకు నష్టం వాటిలినట్లు అధికారులు అంచనావేశారు. 10 ఇండ్లు కూలిపోగా 250 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు చెబుతున్నారు. వర్షాల దాటికి ఇండ్లలో వర్షపునీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెర్వులు, వాగులు పొంగిపొర్లడంతో జనజీవనం స్థంబించింది. చెర్వుల వద్ద చేపల వేట జోరుగా సాగుతున్నాయి. ఒక పక్క వర్షాలతో చెర్వులు నిండాయని సంతోషం వ్యక్తం చేస్తుండగా మరోవైపు నష్టపోయిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేవిధంగా మరోసారి భారీ వర్షం కురిస్తే మండంలో మిగిలిన చెర్వులు నిండినట్లయితే మరింత నష్టం జరిగే అవకాశాలు ఉంటాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రత్నవరం గ్రామానికి వెళ్లే వంతెన వరదదాటికి కొట్టుకుపోయింది. దీంతో రత్నవరం - నడిగూడం గ్రామాలకు రాకపోకలు స్థంబించాయి. గ్రామాల్లో ప్రత్యేక అధికారులతో పాటు కార్యదర్శులు నష్టపోయిన ఇండ్ల వివరాలతో పాటు గ్రామంలో కాల్వలు, వాగులను జేసీబీలతో పూడికను తొలగిస్తున్నారు. మండలకేంద్రానికి చెందిన ప్రత్యేక అధికారి పల్లా శ్రీనివాస్, కార్యదర్శి ఫరీద్‌లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

చిలుకూరులో...
చిలుకూరు, ఆగస్టు 20: గత మూడు రోజులుగా మండలవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా పొలాలు నీట మునిగిపోయాయి. మండలకేంద్రంతో పాటు మండలపరిధిలోని నారాయణపురం, ఆచార్యులగూడెం, చెన్నారిగూడెం గ్రామాల్లోని చెర్వులు నిండి అలుగులు పోస్తున్నాయి. మండలకేంద్రంలోని అంతర్‌గంగా వాగు పొంగిపొర్లడంతో కొత్తచిలుకూరు - పాత చిలుకూరుకు రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలేనిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి ప్రక్కన ఏర్పాటు చేసిన డైవర్షన్‌రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సుమారు 1000 ఎకరాల్లో వరిపొలాలు నీటి మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. రామాపురం గ్రామంలో లోతట్టు ప్రాంతంలోని ఇండ్లలోకి వరదనీరు చేరింది. పొలాల్లోని వ్యవసాయ మోటార్‌లు వరదల్లో కొట్టుకుపోయాయి. మండలవ్యాప్తంగా ఆదివారం 120.6 మిల్లిమీటర్ల వర్షంపాతం నమోదైంది. కొట్టుకు పోయిన డైవర్షన్‌ను మండల పరిషత్ అధ్యక్షుడు నాగేంద్రబాబు పరిశీలించారు.

ప్రకాశం బజార్ దుకాణాలు ధారాదత్తం
* మంత్రి కేటీఆర్ ఉత్తర్వులు జారీ
నల్లగొండ, ఆగస్టు 20: నల్లగొండ ప్రకాశం బజార్ మార్కెట్ మున్సిపల్ దుకాణాలపై హక్కుల కోసం ఏళ్ల త రబడిగా లీజుదారులు సాగిస్తున్న పోరాటం స్థానిక నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి చొరవతో ఫలించింది. 30ఏళ్లుగా మున్సిపల్ దుకాణాల మడిగెలను లీజు తీసుకుని వ్యాపారాలు సాగిస్తున్న వారికే దుకాణాలపై హక్కు లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దుకాణాదారులు తమకే దుకాణాలపై హక్కులు కల్పించాలంటు ఒకవైపు, వెంటనే దుకాణ మడిగెలను తమకు అప్పగించి నూతనంగా ఖరారు టెండర్లలో పాల్గొనాలని మున్సిపాల్టీ మరోవైపు కోర్టులను ఆశ్రయించి పోటాపోటీగా న్యాయపోరాటం సాగిస్తున్నారు. ఈ సమస్యను ఎంపి గుత్తా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్‌కు వివరించగా ఆయన దీనిపై పరిశీలన చేసి 234దుకాణాలను మార్కెట్ ధర మేరకు విలువకట్టి వారికే యాజమాన్య హక్కులు కల్పిస్తు నల్లగొండ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు కాపీని మంత్రి కేటిఆర్ సోమవారం ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డికి అందచేశారు. ఎంపి చొరవకు స్పందించి మంత్రి కేటిఆర్ తమకు దుకాణాలపై హక్కులు కల్పించడంతో ప్రకాశం బజార్ దుకాణాదారుల్లో హర్షాతీరేకాలు వ్యక్తం చేస్తు ఎంపి గుత్తాకు, మంత్రి కేటిఆర్‌కు తమ కృతజ్ఞతలు తెలిపారు.

మలుపు తిరిగిన దుకాణాల హక్కుల వివాదం
నల్లగొండ ప్రకాశం బజార్‌లో మున్సిపల్ దుకాణ సముదాయంలోని 234దుకాణాల్లో 30ఏళ్లుగా పాతుకుపోయిన వ్యాపారులు మున్సిపాల్టీకి 4కోట్ల మేరకు అద్దె బాకి పడ్డారు. ఈ నేపధ్యంలో మున్సిపాల్టీ దుకాణాదారులకు నోటీస్‌లు జారీ చేయగా దీనిపై రెండు వర్గాలు కోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు కొత్తగా వేలం పాటకు బదలులుగా టెండర్ల ప్రక్రియ ద్వారా దుకాణాలు కేటాయించాలని సూచించింది. తుది ఉత్తర్వులు ఇచ్చేదాకా టెండర్లు తెరువరాదంటు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మున్సిపాల్టీ ప్రకాశం బజార్ దుకాణాలకు టెండర్ల ప్రక్రియ నిర్వహించగా 700మంది పాల్గొని డిడిలు కట్టి ఉన్నారు. ఈ కేసు కోర్టులో ఉండగానే ప్రభుత్వం 234దుకాణాల హక్కులను దుకాణాదారులకే కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. కనీసంగా 50కోట్లకు పైగా విలువైన 15ఎకరాల పరిధిలో ఉన్న దుణాకాల ద్వారా కనిష్టంగా మున్సిపాల్టీకి నెలకు 3నుండి 4కోట్ల మేరకు అద్దెల ద్వారా ఆదాయం రానుంది. అలాంటి విలువైన దుకాణాలను మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం సైతం లేకుండా వివాదం కోర్టులో ఉండగానే లీజుదారులకే వాటిపై యాజమాన్య హక్కులను కేటాయించడం గమనార్హం. ప్రభుత్వ ఔదార్యంతో గజం 50వేలకు పైగా ఉన్న దుకాణా స్థలాలు కేవలం పది పనె్నండు వేల మార్కెట్ ధరకే లీజుదారులకు దక్కనున్నాయి. ప్రకాశం బజార్ దుకాణాలపై దుకాణాదారులకు యాజమాన్య హక్కులు కల్పించిన తీరుతో ఇతర మున్సిపాల్టీల్లో సైతం ఇదే రకమైన డిమాండ్లు తలెత్తేందుకు ఆస్కారం ఏర్పడింది.