నల్గొండ

కుల, ధన దురహంకారంతో ప్రణయ్ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, సెప్టెంబర్ 17: కుల, ధన దురహంకారంతో మిర్యాలగూడ పట్టణంలో పెరుమాళ్ల ప్రణయ్‌కుమార్‌ను హత్య చేశారని ఇందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలంగాణ ఐక్య సమాఖ్య (టఫ్) చైర్మన్, అరుణోదయ సాంస్కృతిక కళాకారుల వ్యవస్థాపక అధ్యక్షురాలు, ప్రజా గాయకురాలు విమలక్క కోరారు. సోమవారం మిర్యాలగూడలోని వినోభానగర్‌లో ప్రణయ్ ఇంటిని సందర్శించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, ఆమె పాటతో జోహార్లర్పించారు, తల్లిదండ్రులు హేమలత, బాలస్వామి, ప్రణయ్ తమ్ముడు అజయ్‌లను పరామర్శించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రేమ పెళ్లిలు కులరహిత సమాజ నిర్మాణానికి దోహద పడతాయని, ఇందులో ప్రణయ్, అమృతలు ఆదర్శంగా నిలవగా వారిని బతకనివ్వకుండా చేసిన దుండగులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా బాధిత అమృత డిమాండ్ చేసినట్టుగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హత్య వెనుక, ముందు ఎవరున్నారనేది విచారణ అధికారులు తేల్చాలని కోరారు. దళిత యువతపై ఇటీవల దాడులు అధికమయ్యాయని, పరువు హత్యలు పెరిగాయని వాటిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఆమె అన్నారు. కార్యక్రమంలో మానవహక్కుల వేదిక నాయకులు పీ.సుబ్బారావు, అరుణోదయ కళాకారులు సౌమ్య, సాగర్, తెలంగాణ మట్టి మనుషుల వేదిక వ్యవస్థాపకుడు వేనేపల్లి పాండురంగారావు, తెలంగాణ జనసమితి నాయకులు నాళ్ల అంజయ్య, హఫీజ్ పాల్గొన్నారు.