నల్గొండ

గణేణ్ నిమజ్జనంకు ఏర్పాట్లు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 18: గణేష్ నిమజ్జనంకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షించారు. ఆర్డీవోలు, డి ఎస్పీలు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేయాలని, బారికేడ్లు, క్రేన్‌లు ఏర్పాటు చేయాలని, నిమజ్జనం చెరువులను తనిఖీ చేసి లైటింగ్, జనరేటర్లు, బోట్లు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని రెవిన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం రోజు మద్యం అమ్మకాలు నిలిపివేయాలనీ, ప్రథమ చికిత్స శిభిరాలు, ఫైరింజన్‌లు అందుబాటులో ఉంచాలని, 14వ మైలు రాయి వద్ద ముందు రోజే ఏర్పాట్లను పరిశీలించాలన్నరు. ఆయా శాఖల అధికారులకు కేటాయించిన చోట్ల పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో రవీంద్రనాధ్, హౌజింగ్ పిడి రాజ్‌కుమార్, పరిశ్రమల అధికారి కోటేశ్వర రావు తదితరులున్నారు.
పోలీంగ్ స్టేషన్‌లలో కనీస సౌకర్యాలకై ప్రతిపాదనలు
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉండే పోలీంగ్ స్టేషన్లలో కనీస సౌకర్యాలకై ప్రతిపాదనలు పంపాలనీ ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం ఆయా శాఖల అధికారులతో పోలీంగ్ స్టేషన్ల వసతులపై సమీక్షించి మాట్లాడారు. ఈ నెల 24న ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.

మళ్లీ టీఆర్‌ఎస్‌దే అధికారం
* ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
చండూరు, సెప్టెంబర్ 18: త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వందకు పైగా అసెంబ్లీ స్థానాలు గెలుపొంది అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. మంగళవారం చండూరులోని భారతి చంద్ర ఫంక్షన్ హాలులో నిర్వహించిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి అయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో సర్వేలన్ని టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని ప్రతిపక్షాలు మాత్రం 60 ఏళ్లుగా దోచుకున్నది దాచుకోవడం కోసం ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. స్థానికంగా ఫ్లోరైడ్ సమస్యను పారదోలడానికి రూ.650 కోట్లతో చర్లగూడెం రిజర్వాయర్ పనులను చేపట్టిందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాజెక్టును అడ్డుకోవడం కోసం స్థానిక రైతులను రెచ్చగొడుతుందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్థానిక టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ తోడి వెంకన్న, జి.వెంకట్ రెడ్డి,జెల్లా మార్కండేయ, టీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

సాయుధ పోరాటం గురించి అమిత్‌షాకేం తెలుసు?
ప్రజలను పెడదారి పట్టించేందుకు షా యత్నం * సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
మిర్యాలగూడ, సెప్టెంబర్ 18: తెలంగాణ సాయుధ పోరాటం గురించి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఏం తెలుసని మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం స్థానిక అతిథి రెస్టారెంట్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం అప్పటి నైజాం నవాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిందని, ముస్లింలకు వ్యతిరేకంగా కాదన్నారు. కానీ అమిత్ షా పోరాటం ముస్లింలకు వ్యతిరేకమని చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. నైజాం పాలనలో దేశ్‌ముఖ్‌లు, రెడ్డిలు, నవాబ్‌లే జాగీర్దార్లుగా చలామణి అయ్యారని, నైజాంతో పాటు వారి పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగిందన్నారు. ఆ పోరాటంలో 4 వేల మంది కమ్యూనిస్టులు నేలకొరిగారన్నారు. ఏ త్యాగాలు చేశారని అమిత్‌షా మాట్లాడుతున్నారని నిలదీశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజాసమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి బీఎల్‌ఎఫ్ కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీఎల్‌ఎఫ్ ఎదుగుతున్నదని, బీసీలకు అత్యధిక శాతం అసెంబ్లీ స్థానాలను బీఎల్‌ఎఫ్ కేటాయిస్తుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, టీ మాస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య, కన్వీనర్ మజీదుల్లాఖాన్, రమేష్, నాగరాజు, జాన్‌వెస్లి ఉన్నారు.