నల్గొండ

అస్గర్, బారిలపై నిఘా వైఫల్యం నిజమే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 18: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ఐఎస్‌ఐ మాజీ మిలిటెంట్లు నల్లగొండకు చెందిన అస్గర్ అలీ, అబ్దుల్ బారిల నిందితులుగా తేలగా ఉగ్రవాద చరిత్ర ఉన్న వారి కదలికలను పోలీస్ నిఘా వ్యవస్థలు ముందస్తుగా గుర్తించడంలో విఫలమైన మాట వాస్తవమేనని నల్లగొండ ఎస్పీ ఏ.వీ రంగనాథ్ అంగీకరించారు. మంగళవారం సాయంత్రం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ప్రణయ్ హత్య కేసు నిందితులను హాజరుపరిచి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. ఈసందర్భంగా విలేఖరులు సంధించిన ప్రశ్నలకు ఎస్పీ రంగనాథ్ సమాధానాలిస్తూ అస్గర్, బారిలు మళ్లీ నేరాలకు పాల్పడుతున్న వైనాన్ని నిఘా సంస్థలు గుర్తించడంలో విఫలం చెందాయని అంగీ కరించారు. ఇక మీదట ఈ తరహా పనితీరు ఉండబోదని, పాత నేరస్తులపై నిఘా పెంచుతామన్నారు. అలాగే ప్రణయ్ భార్య అమృతకు, ప్రణయ్ తల్లిదండ్రులకు పూర్తి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మారుతిరావు గత జూన్‌లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన మాట వాస్తమేనని, కానీ ప్రణయ్ హత్యలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశంతో పాటు ఇతర రాజకీయ పార్టీల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. మారుతిరావు తన కూతురు పెళ్లి సమస్యను వీరేశంకు తెలిపిన సందర్భంలో ప్రణయ్ తల్లిదండ్రులతో వీరేశం మాట్లాడి తాను కూడా కులాంతర వివాహం చేసుకున్నానని, పరిస్థితులు చక్కబడేదాకా కొంత సహనం వహించాలని చెప్పి పంపినట్లు ఎస్పీ వెల్లడించారు. కేవలం మారుతిరావు తన కూతురు కులాంతర వివాహాన్ని జీర్ణించుకోలేక పరువు కోసం కిరాయి ముఠాతో హత్య చేయించారన్నారు. ప్రణయ్ హత్యకు కారణమైన మారుతిరావు టీఆర్‌ఎస్ పార్టీకాగా, అతనికి సహకరించిన కరీం కాంగ్రెస్ మిర్యాలగూడ పట్టణాధ్యక్షుడని, అస్గర్, బారిలు ఎంఐఎం సభ్యుడిగా ఉన్నారన్నారు. మారుతిరావు కిరోసిన్ వ్యాపారం చేసినా అక్రమాలకు పాల్పడలేదని, అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంతోనే అతను కోటీశ్వరుడిగా మారాడాన్నారు. రియల్ వ్యాపారంలో భూ వివాదంలో తనను బెదిరించిన బారితో మారుతిరావుకు పరిచయం ఏర్పడిందన్నారు. అదే పరిచయంతో ప్రణయ్‌ను హత్య చేసేందుకు బారిని జూన్, జూలై నెలల్లోనే మారుతిరావు సంప్రదించారన్నారు. బారి తన మిత్రుడైన అస్గర్ అలీని సంప్రదించి కోటి రూపాయల సుపారీకి మారుతిరావుతో ప్రణయ్ హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. బారి తనకు రాజమండ్రి జైలులో పరిచయమైన బీహారి సుహస్తిపూర్‌కు చెందిన చోరీ కేసులో నిందితుడైన సుభాష్‌శర్మను సంప్రదించి ఇక్కడికి రప్పించుకున్నారన్నారు. మూడు నెలలుగా సుభాష్‌శర్మ మిర్యాలగూడ, నల్లగొండ, చిట్యాల తదితర ప్రాంతాల్లో మకాం వేస్తూ అస్గర్, బారిల ఆదేశాల మేరకు నడుచుకున్నాడన్నారు. అందులోభాగంగా ఆగస్టు 9న ప్రణయ్ ఇంటి ముందు రెక్కీ సైతం నిర్వహించారన్నారు. ఆ తర్వాత ఆగస్టు 14న ఓ బ్యూటీ పర్లర్ వద్ద ప్రణయ్, అమృత కలిసి ఉన్నప్పుడు మొదటిసారి హత్యకు యత్నించారని తెలిపారు. కాగా, ఆ సమయంలో ప్రణయ్‌తో అతడి సోదరుడు ఉండడంతో ఇద్దరిలో ఎవరూ ప్రణయ్ అన్నది తెలియక చివరి నిమిషంలో ప్రయత్నాన్ని విరమించుకున్నారని ఎస్పీ రంగనాథ్ వివరించారు. అనంతరం ప్రణయ్, అమృత రిసెస్పషన్ ఆగస్టు 17న జరగగా మిర్యాలగూడలో తన పరువు మొత్తం పోయందని అప్పటి నుంచి మారుతిరావు కక్షను మరింత పెంచుకున్నాడు. హత్యా యత్నాన్ని ముమ్మరం చేయాలని సుపారీ గ్యాంగ్‌తో మాట్లాడాడు. అలా సెప్టెంబర్ మొదటి వారంలో అమృతను కిడ్నాప్ చేసి ప్రణయ్‌ను రప్పించి మట్టుబెట్టాలని మరో ప్లాన్ వేశారు. కాని అది అమల్లోకి రాలేదు. దీంతో ఈసారి ఎలాగైన పని ముగించే యాలనుకున్న సుపారీ గ్యాంగ్ ఈనెల 14న అమృత, ప్రణయ్‌లు జ్యోతి ఆసుపత్రికి వస్తున్న సమాచారాన్ని ఒక రోజు ముందుగా మారుతిరావు ద్వారా తెలుసుకున్నారు. అలా అస్గర్, సుభాష్‌శర్మలు ఆసుపత్రి వద్ద మాటువేసి ప్రణయ్ హత్యను పూర్తి చేశారు.

అస్గర్‌అలీ, బారిలకు ఉగ్ర చరిత్ర
ప్రణయ్ హత్యకేసులో నిందితులుగా ఉన్న ఐఎస్‌ఐ మాజీ మిలిటెంట్లు అస్గర్ అలీ, అబ్దుల్ బారి, సుభాష్‌శర్మల చరిత్రను ఈసందర్భంగా ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. అస్గర్ అలీ 1993లో నల్లగొండ విద్యాభారతీ హైస్కూల్‌లో పది తరగతి చదివాడు. 1993లో ఖార్ఖానా ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఐఎస్‌ఐ మిలిటెంట్ నల్లగొండకు చెందిన ఫసీయుద్ధిన్‌తో ఏర్పడిన పరిచయంతో ఐఎస్‌ఐ ఉగ్రవాద శిక్షణ పొందాడు. తదుపరి అస్గర్ నల్లగొండకు చెందిన షేక్ ఫరీద్, షేక్ అవద్, అబ్దుల్ బారి, షేక్ ఓబైద్‌లలను కూడా ఉగ్రవాద కార్యకలాపాల్లో చేర్పించాడు. అస్గరల్ అలీ తను అనుఛరులు బారి, షఫీ, ఇంతియాజ్, నూర్ రహ్మన్‌లతో 2003లో గుజరాత్ హోంశాఖ మాజీ మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో పాలు పంచుకున్నారు. 2003 ఏప్రిల్‌లో 16న అస్గర్ అలీతో పాటు మిత్రులు సైదాబాద్‌కు చెందిన రవూఫ్, టోలిచౌకి సయ్యద్ ఇఫ్తెకర్, అబ్దుల్ బారీ, షఫీలను సిబిఐ హైద్రాబాద్‌లో అరెస్టు చేసి సబర్మతి జైలులో పెట్టారు. 2013 అక్టోబర్ 16న బెయిల్‌పై బయటకు వచ్చారు. అస్గర్ అలీపై జిల్లాతో పాటు బయట మొత్తం 14 కేసులున్నాయి.
నల్లగొండకు చెందిన మరో ఐఎస్‌ఐ మాజీ మిలిటెంట్ అబ్దుల్ బారికి 1993లో ఫసీయొద్దిన్, అస్గర్ అలీ, షేక్ ఓబైద్, షేక్ ఆవద్, ఎండి.షఫీ, షేక్ ఫరీద్‌లతో ఏర్పడిన పరిఛయంతో ఐఎస్‌ఐ కార్యకలాపాల్లో భాగస్వామ్యమయ్యాడు. తరీక్ ముస్లిం షబ్బాన్ (టీఎంఎస్) అనే తమ చాందసవాద సంస్థలో పనిచేసి ప్రస్తుతం ఎంఐఎం సభ్యుడిగా హైద్రాబాద్ మలక్‌పేటలో ఉంటున్నారు. మిర్యాలగూడకు చెందిన మారుతిరావు భూవివాదంలో జోక్యం చేసుకున్న బారి మారుతిరావును కిడ్నాప్ చేసి బెదిరించగా 2011లో మిర్యాలగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అబ్దుల్ బారిపై జిల్లాలో, బయట మొత్తం తొమ్మిది కేసులున్నాయి. మరో నిందితుడు సుభాష్‌శర్మ బీహర్ సుహస్తపూర్ వాసియని, అతడు చోరిపై రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు బారితో పరిచయడం ఏర్పడిందని, ప్రణయ్‌ను హత్య చేసిన పిదప శర్మ బెంగళూరు మీదుగా బీహార్ పారిపోగా జిల్లా పోలీస్ బృందాల సహకారంతో బీహార్ పోలీసులు శర్మను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేసి కోర్టు అనుమతితో నల్లగొండ జిల్లాకు తరలిస్తున్నారని తెలిపారు.