నల్గొండ

యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, అక్టోబర్ 11: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకివచ్చినా టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు మాత్రం పట్టినట్లులేదు. ఎన్నికల కోడ్‌ను బేఖాతరుచేస్తు యదేచ్ఛగా ఓటర్లకు హామీలు ఇస్తు భూమి పూజాకార్యక్రమాలు చేపడుతున్న జిల్లా ఎన్నికల అధికారులకు మాత్రం ఇవేవి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి క్రిష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మండలంలోని బొమ్మాయిపల్లి గ్రామంలో పీర్లచావిడి, ఆంజనేయస్వామి దేవాలయాల నిర్మాణాలకు గురువారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా భువనగిరి పట్టణంలోని పలు వార్డులలో, మండలంలోని పలు గ్రామాలలో వాటర్‌ప్లాంట్‌లను ఏర్పాటుచేస్తు ప్రారంభోత్సవాలు కొనసాగిస్తున్నా అధికారులు ఇవేవి పట్టించుకున్న పాపాన పోవడంలేదు.
ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లినా...
టీఆర్‌ఎస్ నాయకులు చేపడుతున్న ప్రారంభోత్సవాలు, ఓటర్లతో ఓటు మీకే వేస్తామని ప్రతిజ్ఞలు ఆధారాలతో సహా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేసినా చర్యలు శూన్యమని ప్రతిపక్ష నాయకులు వాపోతున్నారు. అధికారులు టీఆర్‌ఎస్ పార్టీకి తొత్తులవలే పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని ప్రతిపక్షనాయకులు హెచ్చరిస్తున్నారు.