నల్గొండ

గోదావరి జలాలతో కాళ్లు కడుగుతా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుర్కపల్లి, నవంబర్ 9: ప్రజలు ఆశీర్వదిస్తే గోదావరి జలాలు సాధించి ఆ నీరు ద్వారా నియోజక వర్గ ప్రజల కాళ్లు కడుగుతానని బిఎల్‌ఎఫ్ బలపరిచిన స్వతంత్య్ర అభ్యర్థి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు వెంకటాపురం, వీరారెడ్డి పల్లి, ఇబ్రహీం పురం, కోనాపురం, దత్తాయ పల్లి, ముల్కల పల్లి, వేలుపల్లి తిరుమలాపురం తదితర గ్రామాలలో పల్లె పల్లెకు మోత్కుపల్లి ప్రచారాన్ని డప్పుచప్పుళ్లతో ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గజం ఉప్పలయ్య మోతుకుపల్లి రఘు, శ్రీరామ మూర్తి, సీతన్నారయణ, ఊముల నాయక్ తదితరులు పాల్గొన్నారు.

బెల్టుషాపులపై దాడులు.. * ఆరుగురు బైండోవర్
నాంపల్లి, నవంబర్ 9: మండలంలోని పెద్దాపురం గ్రామంలో శుక్రవారం నాంపల్లి పోలీసులు బెల్టుషాపులపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన బొమ్ము సైదులు దుకాణంపై దాడి చేయగా అక్రమంగా మందు అమ్ముతుండగా 38 మధ్యం బాటిల్లు స్వాధీణం చేసుకున్నట్లు నాంపల్లి ఎస్‌ఐ జమ్ము శివకుమార్ తెలిపారు.అదే గ్రామంలో మరో ఆరుగురు వ్యక్తులు అనుమతి లేకుండా మద్యం అమ్మకాలు జరుపుతుండగా పట్టుకుని బైండొవర్ చేసి స్థానిక తహసిల్దార్ అరుణ జ్యోతికి అప్పగించినట్లు ఆయన తెలిపారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మండలంలోని నేరంగపల్లి, నాంపల్లి, హస్నూరు, ముష్టిపల్లి గ్రామాల్లో టిఐఎస్‌ఎఫ్ ఫోర్స్ ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు.