నల్గొండ

ఇక పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 8: గ్రామ పంచాయతీ ఎన్నికలను జనవరి 10వ తేదిలోపు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కసరత్తు దిశగా చర్యలు చేపట్టింది. బీసీ రిజర్వేషన్ల వివాదంపై సుప్రీంకోర్టు అన్ని రిజర్వేషన్లు 50శాతం దాటవద్ధంటు స్పష్టమైన ఆదేశాలివ్వడం, హైకోర్టు జనవరి 10లోగాఎన్నికలు నిర్వాహించాలని చెప్పడంతో ఇక పంచాయతీ ఎన్నికల నిర్వాహణ తప్పదని తేలింది. అందుబాటులో ఉన్న వివరాల మేరకు బీసీ ఓటర్ల జాబితాను రూపొందించి డిసెంబర్ 13,14తేదిల్లో గ్రామసభల్లో ఆమోద తంతు ముగించి డిసెంబర్ 15వ తేదిన తుది ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు పిదప జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆలోఛనతో ఉన్నామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్ సైతం వెల్లడించారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల సందడి ముగిసిన వెంటనే కొత్త ఏడాది కొత్త ప్రభుత్వ హాయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు అవకాశముండటంతో నెలన్నర వ్యవధిలోనే పల్లెల్లో మరోసారి ఎన్నికల సందడి నెలకొననుంది.
ఎన్నికలు ధనస్వామ్యంలో
సాగాయి: జూలకంటి
* ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు * సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి ఆరోపణ
మిర్యాలగూడ టౌన్, డిసెంబర్ 8: మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలో ఈ నెల 7న జరిగిన పోలింగ్‌లో ప్రజాస్వామ్యంలో కాదు.. ధనస్వామ్యంలో సాగాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మిర్యాలగూడ నియోజకవర్గ అభ్యర్ది జూలకంటి రంగారెడ్డిఆరోపించారు. శనివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల అధికారులు, పోలీసులకు తమ పార్టీ వారు, తాము ఎన్నో సార్లు ఫోన్ చేసిన, ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపించారు. డబ్బు పంచుతున్నారు, రాండంటు ఫిర్యాదు చేసిన కూడ రాలేదన్నారు. సి విజిల్ యాప్‌కు ఫిర్యాదు చేస్తే నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి పోతుందని చెప్పిన అధికారులు, కేంద్రం నుండి ఈ పోలీసులనే వెళ్లాలని ఆదేశించిన వారు రాలేదని ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఆర్ధిక అరాచకం సాగిందని ఆరోపించారు. ఫిర్యాదు చేసే వారినే అణచివేసేందుకు ముందుకు వచ్చారన్నారు. ఓట్లు సంతలో సరుకులా మారాయని ఆరోపించారు. ఎన్నికలు వచ్చాయంటే సంత చేసినట్టే చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇలాంటి వ్యాపారులను కనిపెట్టాలని, వారు సేవలందించరని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వాదులు, ప్రజలు ధనస్వామ్యాన్ని ఖండించాలని కోరారు. ప్రజలు ఎన్నికల సందర్భంగా తనను ఆదరించినందుకు కృతఙ్ఞతలు తెలిపారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.మల్లేష్, మహ్మద్‌బిన్‌సయిద్, చంద్రశేఖర్‌యాదవ్, డి.రవినాయక్, టి.రామ్మూర్తి, నాగునాయక్‌లు పాల్గొన్నారు.
గెలిచేదెవరో.. జోరుగా చర్చలు!
* ఓట్ల లెక్కల మథనంలో అభ్యర్థులు!!
* స్ట్రాంగ్‌రూమ్ ఈవీఎంలలో భవితవ్యం

నల్లగొండ, డిసెంబర్ 8: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్‌రూమ్‌కు చేరుకోగా, ఈనెల 11న జరిగే ఓట్ల లెక్కింపు కంటే ముందే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..ఎవరెవరు గెలుస్తారన్న దానిపై ప్రజల్లో, పార్టీల్లో చర్చోపచర్చలు జోరందుకున్నాయి. ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్ధికి ఎన్ని ఓట్లు పోలయ్యాయి..గెలిచేదెవరన్న ఉత్కంఠతో అభ్యర్థులు, వారి పార్టీల శ్రేణులు, రాజకీయ వర్గాలు పోలింగ్ సరళిని విశే్లషిస్తు కూడికలు, తీసివేతల లెక్కల్లో నిమగ్నమయ్యారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఏ నలుగురు కలిసినా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న అంశంపైనే చర్చలు సాగుతుండటం ఫలితాల పట్ల ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠతకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఒకవైపు వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అంఛనాలు భేరీజువేసుకుంటు, ఇంకోవైపు పోలింగ్ స్టేషన్ల వారిగా ఏ పార్టీ అభ్యర్ధికి ఎన్ని ఓట్లు పడ్డాయన్న దానిపై తమ పోలింగ్ ఎజెంట్లతో భేటీలు వేసి మరి అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ఫలితాలను అంఛనా వేసే పనిలో పడ్డారు. ఓటర్లకు అందించాల్సిన సొమ్ము వారికి సక్రమంగా చేరిందా ఏయే గ్రామాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయన్న దానిపై పోలింగ్ ముగిసిన వెంటనే అభ్యర్థులు లెక్కలు వేసే పని సాగిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పనె్నండు అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో ప్రజాకూటమి మద్ధతుతో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులకు, టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మధ్య ప్రచారం తీరులోనే పోలింగ్ సైతం హోరాహోరిగానే సాగినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ సీనీయర్లు కె.జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆర్. దామోదర్‌రెడ్డిలు పోటీ చేసే స్థానాల్లోనూ టీఆర్‌స్ అభ్యర్థులతో నువ్వానేనా అన్న పోటీ సాగినట్లుగా పోలింగ్ సరళీ మేరకు అంఛనా వేస్తుండటం ఫలితాలపై మరింత ఆసక్తి రేకెత్తిస్తుంది. నాగార్జున సాగర్‌లో కె.జానారెడ్డితో టీఆర్‌ఎస్ అభ్యర్ధి నోముల నరసింహయ్యకు, నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో టీఆర్‌ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్‌రెడ్డిల మధ్య గట్టిపోటీ సాగింది. ఓటింగ్ సరళీని విశే్లషించుకున్న అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే సూర్యాపేటలో కాంగ్రెస్ అభ్యర్ధి ఆర్. దామోదర్‌రెడ్డికి, టీఆర్‌ఎస్ అభ్యర్ధి, మంత్రి జి.జగదీష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్ధి సంకినేని వెంకటేశ్వర్‌రావుల మధ్య త్రిముఖ పోటీలో ఓటర్లు మూడు పార్టీల మధ్య చీలిపోవడంతో విజయం ఎవరికైనా దక్కే పరిస్థితి నెలకొంది. ముగ్గురు అభ్యర్థులు కూడా పోలింగ్ సరళిని విశే్లషించుకుని గెలుపుపై ధీమాగా ఉన్నారు. హుజూర్‌నగర్‌లో పీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపుపై ధీమాగా ఉన్న ముందుగా ఆయన ఆశించిన 50వేల మెజార్టీ మాత్రం రాదన్న చర్చ సాగుతుంది. అలాగే మిర్యాలగూడలో చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యపై టీఆర్‌ఎస్ అభ్యర్ధి ఎన్. భాస్కర్‌రావుదే పోలింగ్‌లో పైచేయిగా కనిపించిందన్న విశే్లషణలు జోరుగా వినిపిస్తున్నాయి. దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్ధి ఎన్.బాలునాయక్‌పై టీఆర్‌ఎస్ అభ్యర్ధి ఆర్. రవీంద్రకుమార్, నకిరేకల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి వేముల వీరేశంపై కాంగ్రెస్ అభ్యర్ధి చిరుమర్తి లింగయ్య, కోదాడలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి బొల్లం మల్లయ్య యాదవ్‌పై కాంగ్రెస్ అభ్యర్ధి ఎన్. పద్మావతి ఉత్తమ్‌కు, మునుగోడులో టీఆర్‌ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలకు గెలుపు అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతుంది. అభ్యర్థులు మాత్రమే గెలుపు తమదంటే తమదే అంటు లెక్కల్లో మునిగారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్ధి పైళ్ల శేఖర్‌రెడ్డిల మధ్య నువ్వానేనా అన్న పోటీ సాగిందని, బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్ధి జిట్టా బాలకృష్ణారెడ్డి సాధించే ఓట్లే విజేతను నిర్ణయిస్తాయన్న అంఛనాలు వినిపిస్తున్నాయి. తుంగతుర్తిలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి గాదరి కిషోర్, కాంగ్రెస్ అభ్యర్ధి అద్దంకి దయాకర్‌ల మధ్య సైతం నువ్వానేనా అన్నట్లుగా ఓటింగ్ సాగిందని తెలుస్తుంది. ఆలేరులో టీఆర్‌ఎస్ అభ్యర్ధి గొంగిడి సునీత, కాంగ్రెస్ అభ్యర్ధి బూడిద భిక్షమయ్యగౌడ్‌ల మధ్య గెలుపు ఓటములను నిర్ణయించడంలో బిఎల్‌ఎఫ్ అభ్యర్ధి మోత్కుపల్లి నరసింహులు సాధించే ఓట్లతో పాటు పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుందన్న అంశం విజేతను నిర్ణయిస్తుందన్న ప్రచారం నెలకొంది. ఎవరి అంఛనాలు విశే్లషణలు ఎలా ఉన్నా వాస్తవ ఫలితం మాత్రం ఈ నెల 11న జరిగే లెక్కింపులో తేలనుంది.

గెలుపు నాదే..
అధికారం ప్రజాకూటమిదే..
* నల్లగొండ ప్రజాకూటమి అభ్యర్థి వెంకట్‌రెడ్డి
నల్లగొండ రూరల్, డిసెంబర్ 8: నల్లగొండలో గెలుపు తనదేనని అధికా రం ప్రజాకూటమిదేనని మాజీ మంత్రి కాంగ్రెస్ నల్లగొండ అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో నకిరేకల్ అసెంబ్లీ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మహాకూటమికి 60నుండి 70సీట్లు వస్తాయని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని తొలుత రైతు ఋణ మాఫీ చేస్తామన్నారు. సచివాలయం నుండి తమ పాలన కొనసాగుతుందని ఆయన తెలిపారు. జిల్లాలో 12సీట్లలో 9సీట్లు ప్రజాకూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గతంలో ఎస్సెల్‌బీసీ సొరంగాన్ని కుర్చి వేసుకుని పూర్తి చేస్తానని చెప్పి ఎందుకు పూర్తి చేయలేదో ప్రశ్నించారు. వచ్చే ప్రజాకూటమి ప్రభుత్వంలో ఎస్సెల్‌బీసీ, బ్రాహ్మణ వెల్లెంల, నల్లగొండలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తామన్నారు. నల్లగొండలో 20 ఏళ్లలో తాను ఎంతో అభివృద్ధి చేశానని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, పాశం సంపత్‌రెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి, అనూప్‌రెడ్డి, జూకూరి రమేష్, అల్లి సుభాష్ యాదవ్, సట్టు శంకర్ తదితరులు ఉన్నారు.
మస్కట్‌లో యాదాద్రి
లక్ష్మీనరసింహుల కల్యాణం
యాదగిరిగుట్ట, డిసెంబర్ 8: యాదాద్రి లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవాన్ని మస్కట్ నగరంలోని తెలుగు ప్రజలు శనివారం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుని పులకించారు. యాదాద్రి ఆలయ ప్రధానార్చకులు నంధీగల్ లక్ష్మీనరసింహాచార్యుల బృందం పర్యవేక్షణలో పాంఛరాత్రాగమశాస్త్రానుసారం వేద మంత్రోచ్చరణల మధ్య కన్నుల పండువగా నిర్వహించిన లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవంలో మస్కట్ తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తమ భక్తీప్రపత్తుల చాటుకున్నారు. గోవింద నామస్మరణలతో స్వామివారిని కీర్తించి తన్మయులయ్యారు. మస్కట్ తెలుగు సంఘం నిర్వాహకులు యాదాద్రి దేవస్థానాన్ని సంప్రదించి తగిన ఆర్ధిక చెల్లింపు జరిపి మస్కట్‌లో లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవాన్ని జరిపించుకోవడం విశేషం.

ఈవీఎం గోదాంలను
పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
నల్లగొండ రూరల్, డిసెంబర్ 8: నల్లగొండ పట్టణ సమీపంలోని దుప్పలపల్లి ఎఫ్‌సీఐ గోదాంల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ఈవీఎం స్ట్రాంగ్ రూంల గోదాంలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ రంగనాథ్‌లు శనివారం పరిశీలించారు. వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన ఈవీఎంలను వరుస క్రమంలో భద్రపరిచేలా సిబ్బందికి సూఛనలిచ్చారు. మరోవైపు కౌంటింగ్ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లను అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల ఈవీఎంలను ఇక్కడ భద్ర పరిచి ఈ నెల 11న ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఇక్కడే నిర్వహించనున్నారు.