నల్గొండ

తెరపైకి మిర్యాలగూడ జిల్లా అంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, డిసెంబర్ 13: మిర్యాలగూడ, హూజర్‌నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాలను కలిపి మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని ఈ మూడు నియోజకవర్గాల ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న ముఖ్యపట్టణాల్లో మిర్యాలగూడ ఒకటి. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో భౌగోళిక స్వరూపంలో తూర్పు, దక్షిణ దిక్కున ఉన్న అన్ని ప్రాంతాల వారు మిర్యాలగూడలోకి చేరుకునేందుకు రవాణా పరంగా అనువుగా ఉన్నది. రైస్ ఇండస్ట్రీలో ఆసియా ఖండంలో రెండో స్థానంలో మిర్యాలగూడ పట్టణం ఉండడంతో పాటు వ్యవసాయ మార్కెట్ విషయంలో తెలంగాణలో మిర్యాలగూడ ఐదో స్థానంలో ఉంది. సిమెంట్ పరిశ్రమలు, నాపరాయి పరిశ్రమలు, యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ వేలాదిమందికి ఉపాధితో పాటు జనాభా పరంగా కూడా అధికంగా ఉంది. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో అటవీ సంపద, మత్స్య, ఖనిజ సంపద మొదలైన వనరులు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా మిర్యాలగూడకు 25 కిలోమీటర్ల దూరంలో వాడపల్లి వద్ద కృష్ణ, మూసీ నదుల సంగమం ఉంది. కాకతీయ రాజులు 12వ శతాబ్దంలో నిర్మించిన మీనాక్షి అగస్తేశ్వరస్వామి దేవాలయం ఉండడంతో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా పేరుపొందింది. 64 కిలో మీటర్ల దూరంలో నాగార్జునసాగర్‌లో నందికొండ పర్యాటక కేంద్రం కూడా ఉండడంతో పాటు నందికొండ గ్రామంలో బౌద్ధ అవశేషాలు బయటపడడంతో వీటిని కేంద్ర పురవస్తు శాఖ మ్యూజియం ఏర్పాటు చేసి భద్రపరిచారు. అంతేకాకుండా మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హూజుర్‌నగర్ నియోజకవర్గాలలోని భూములకు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా నీరు అంది ఆహార ఉత్పత్తులను రైతులను పండిస్తున్నారు. దాంతో రైస్ ఇండస్ట్రీ పరిశ్రమ అభివృద్ధి చెంది వేలాది మందికి ఉపాది లభిస్తుంది. మిర్యాలగూడ తెలంగాణ రాజధాని హైద్రాబాద్ 140 కిలోమీటర్ల దూరం, వరంగల్ 170 కిలోమీటర్లు, ఆంధ్ర రాజధాని అమరావతి, గుంటూరు, విజయవాడలు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మిర్యాలగూడ పట్టణం మీదుగా నార్కట్‌పల్లి, అద్దంకి రహదారి వెళ్తుడంతో పాటు రైల్వే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. విద్య, వైద్య, తాగునీరు, సాగునీరు, విద్యుత్, బ్యాకింగ్, రవాణా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. అంతేకాకుండా జిల్లాగా మిర్యాలగూడను ఏర్పాటు చేస్తే కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూమి కూడా అందుబాటులో ఉంది. అయితే గతంలో మిర్యాలగూడను జిల్లాగా చేస్తామని కేసీఆర్ హమీ ఇచ్చినట్లు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మిర్యాలగూడ ప్రాంత ప్రజలు మిర్యాలగూడను జిల్లాను చేయాలని కోరుతున్నారు.

హామీల అమలుపై చిగురిస్తున్న ఆశలు
* సింగిల్ పర్మిట్ విధానం అమలయ్యేనా..!?
* యాదాద్రి థర్మల్ ప్లాంట్, ఎత్తిపోతల కోసం ఎదురుచూపులు

మిర్యాలగూడ, డిసెంబర్ 13: ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అవుతాయని ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రంలో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకుంటాయని ప్రజలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు సింగిల్ టాక్స్ విధానంను అమలు చేస్తానని, దీనిపై ఆంధ్ర ముఖ్యమంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన దగ్గరి నుండి ఇరురాష్ట్రాలు రెండు వైపుల వాహనాలకు టాక్స్ వసూలు చేయడం వల్ల వాహనదారులపై ఆర్థిక భారం పడి రవాణారంగం సంక్షోభంలో కూరుకుపోయింది. రవాణా రంగాన్ని సంక్షోభం నుండి గట్టు ఎక్కించేందుకు, వాహదారులను ఆదుకునేందుకు సింగిల్ టాక్స్ విధానం అమలు చేసేందుకు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతానని, ఆయన వినకపోతే ఆంధ్ర వాహనాలను తెలంగాణలో తిరుగనవ్వమని ప్రచార సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో హామీ అమలు చేస్తారని వాహనదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ విధానం అమలు జరిగితే రాష్ట్రంలోని రైస్ మిల్లు అధికంగా ఉన్న మిర్యాలగూడ ప్రాంతంలోని వాహనదారులకు అధికంగా ప్రయోజనం జరుగుతుంది.
అంతేకాకుండా రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా దామరచర్ల మండలంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉందని, అంతేకాకుండా విస్తరణ పనులు సైతం చేపట్టే అవకాశం ఉంది. యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణం పూర్తయినట్లయితే ఈ ప్రాంతంలోని ప్రజలకు విద్యుత్ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. కాగా, దామరచర్ల మండలంలో బీడు భూములకు సాగునీరు అందించేందుకుగాను మంజూరుచేసిన మూడు ఎత్తిపోతల పథకాలు పూర్తయి బీడు భూములు సాగులోకి వస్తాయని రైతులు భావిస్తున్నారు. మిర్యాలగూడ పట్టణంలో మహిళ డిగ్రీ కళశాలను, పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేస్తానని కేసీఆర్ ఇచ్చిన హమీలు సైతం అమలవుతాయని ఆశిస్తున్నారు. మిర్యాలగూడ పట్టాణాభివృద్ధికి గతంలో రూ.200కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి రూ.100 కోట్లను మంజూరు చేయగా, మరో రూ.100 కోట్లు కూడా మంజూరై మిర్యాలగూడ పట్టణం అభివృద్ధి చెందుతోంది. ఇచ్చిన హామీలను త్వరిగతిన అమలుచేయాలని జిల్లా ప్రజలు కేసీఆర్‌ను కోరుతున్నారు.

కమలం కకావికలం
* పేట మినహా ప్రభావం శూన్యం
* అగ్రనేతలు ప్రచారం చేసినా స్పందించని ప్రజానీకం
* మూడుచోట్ల స్వతంత్రుల కంటే తక్కువ ఓట్లు

సూర్యాపేట, డిసెంబర్ 13: కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ ముందస్తు ఎన్నికల్లో తలపడిన కమలం పార్టీ ప్రభావం జిల్లాలో శూన్యమైపోయింది. మార్పు కోసం బీజేపీ అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చి.. కేంద్ర పథకాలను వల్లివేసినా జిల్లా ప్రజలు ఎంతమాత్రం ఆ పార్టీని ఆదరించని పరిస్థితి స్పష్టమైంది. జిల్లా పరిధిలో నాలుగు శాసనసభ నియోజవర్గాలు ఉన్న ఒక్క సూర్యాపేట మినహా మిగిలిన మూడు నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండి స్వతంత్ర అభ్యర్థుల కంటే తక్కువగా ఓట్లు సాధించి దారుణస్థితికి చేరింది. అధికార టీఆర్‌ఎస్‌తో పాటుగా ప్రజాకూటమి అభ్యర్థులకు ఏమాత్రం తీసిపోకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. అయినప్పటికీ ఒక్క సూర్యాపేట మినహా మిగిలిన స్థానాల్లో తన సంప్రదాయ ఓటు బ్యాంకును సైతం కాపాడుకోలేక చతికిలపడింది. గత 2014 ఎన్నికల్లో సాధించిన ఓట్లు కూడా ఈసారి రాకపోవడంతో కమలనాథులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. బీజేపీ అధిష్ఠానం మొదటి నుండి ఆశలు పెట్టుకున్న సూర్యాపేట స్థానంలోనూ మూడో స్థానానికి పరిమితమైపోయింది. ఇక్కడ పార్టీ తరుపున బరిలో నిలిచిన సంకినేని వెంకటేశ్వరరావు విజయంపై రాష్ట్ర, జాతీయస్థాయిలో అధినాయకత్వం ధీమాగా ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం పోటీ అధికార టీఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్యే కొనసాగి సంకినేని మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్టీ గెలుపు కోసం ఇక్కడ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నితిన్ గడ్కరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరీలు ప్రచారం చేసినప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. గత ఎన్నికల సమయంలోనే బీజేపీలో చేరినప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచిన సంకినేని ఈసారి పార్టీ గుర్తుపై పోటీ చేసినా మూడోస్థానంతో సరిపెట్టుకోవడం కాషాయ శ్రేణులకు మింగుడుపడకుండా చేసింది. సంకినేని వెంకటేశ్వరరావు ఇక్కడ 39,241ఓట్లు సాధించడం గొప్పగా భావిస్తున్నా ఆది పార్టీ పరంగా కాకుండా సొంతంగా సంకినేని సాధించిన ఓట్లు అన్నది బహిరంగ రహస్యమే. ఇక కోదాడ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి జిల్లేపల్లి వెంకటేశ్వరరావుకు కేవలం 1485 ఓట్లు మాత్రమే రాగా ఈ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన మనె్నబోయిన ఆంజనేయులకు 5240, బీఎల్‌ఎఫ్ అభ్యర్థి బుర్రి శ్రీరాములకు 3381, తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి కే.దేవెందర్‌రెడ్డికి 1508 ఓట్లు రావడం గమనార్హం. అదేవిధంగా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బొబ్బ భాగ్యారెడ్డికి 1555 ఓట్లు రాగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన రఘుమారెడ్డికి 4944 ఓట్లు, నోటాకు 1621 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కడియం రాంచంద్రయ్యకు 3222 ఓట్లు రాగా ఈ స్థానంలో కూడా స్వతంత్ర అభ్యర్థి బాదె అనిల్‌కు 3729 ఓట్లు వచ్చాయి. ఈ మూడు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థుల కంటే బీజేపీ అభ్యర్థులు తక్కువగా ఓట్లు పొందడం బీజేపీ శ్రేణులకు మింగుడు పడని విషయంగా మారింది. తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్‌లలో కేంద్ర మంత్రులు, అగ్రనేతలు ప్రచారం చేసినప్పటికీ ఏ మాత్రం ప్రభావం లేకపోయింది. మొత్తంగా జిల్లాలో బీజేపీకి 2019 ఎన్నికల ఫలితాలు చేదు అనుభవాలను మిగిల్చాయి.

హామీల అమలుపై ఆశలు
* గొంగిడి సునీతకు మంత్రి పదవి..
* గుండాలను యాదాద్రిలో కలుపుతామన్న కేసీఆర్
ఆలేరు, డిసెంబర్ 13: ముందస్తు ఎన్నికల్లో భాగంగా గత నవంబర్ 27న ఆలేరు ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల్లో భాగంగా గొంగిడి సునీతను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆమె హోదాను పెంచుతానని జనగామ జిల్లాలో కలిపిన గుండాల మండలాన్ని తిరిగి యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల్లోపునే కలుపుతామని ఇచ్చిన హామీ త్వరలోనే నెరవేరనున్నది. ముందస్తు ఎన్నికల్లో ఆలేరు శాసనసభ స్థానానికి గొంగిడి సునీత 33వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందడంతో ఆమెకు మంత్రి పదవి ఖాయమని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. గత సభలో గొంగిడి సునీత నా బిడ్డ అని, ఆమెకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం, తిరిగి అధికారంలోకి టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావడంతో ఆమెకు మంత్రి పదవి లాంఛనమేనని భావిస్తున్నారు. ఇక గుండాల విషయానికి వస్తే రెండోసారి గెలుపొందిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరో రెండు జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేస్తాననడంతో జిల్లాల విభజన మళ్లీ జరుగుతుందని, గుండాల తిరిగి యాదాద్రి జిల్లాలో కలుస్తుందని విశే్లషకులు భావిస్తున్నారు.