నల్గొండ

దాహం తీర్చు పద్మక్కా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నశంకరంపేట, మే 31: మండల పరిధి దర్‌పల్లి గ్రామంలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించేందుకు మంగళవారం సాయంత్రం ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి గ్రామానికి రాగా గ్రామంలోని చౌరస్తాలో ఉపసభాపతి కాన్వాయిని 1వ వార్డు మహిళలు, గ్రామస్తులు ఖాళీ నీటి బిందెలతో అడ్డుకొని నిరసన తెలిపారు. అనంతరం 1వ వార్డులో తీవ్ర మంచినీటి ఎద్దడి ఉందని గ్రామ సర్పంచ్ పాలకవర్గంకు పలుమార్లు తెలిపినప్పటికి పట్టించుకోకపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని మహిళలు, గ్రామస్థులు తెలిపారు. అనంతరం గ్రామంలోని కసాన్‌చెరువు అభివృద్ధి పనులకు పద్మాదేవేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మల్లన్నసాగర్ ద్వారా హల్దివాగును నీటితో నింపుతామని, దీంతో 10 గ్రామాలకు తాగునీరు అందుతుందని తెలిపారు. గత ప్రభుత్వాలు చెరువు కుంటలను నిర్లక్ష్యం చేయడంతో చెరువు, కుంటలు బోసిపోయి కరువుకాటకాలు ఏర్పడ్డాయని ఆమె తెలిపారు. చెరువుల పూడికతీతతో జలకళ ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌ల ద్వారా 6.51 లక్షల హెక్టార్లలో సాగునీరు అందుతుందని, దీంతో రైతులు బాగుపడతారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శే్వత మహిపాల్‌రెడ్డి, ఎంపిటిసి ఉప్పరి శ్రీనివాస్, తెరాస నాయకులు లక్ష్మారెడ్డి, నరేందర్, రాజు, సాన సత్యనారాయణ, కుమార్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.