నల్గొండ

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 31: బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కల్గించే విధంగా పోగ పీల్చడం చట్టరిత్యా నేరమని, ఇందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరిమానా, శిక్షలు విధించే అవకాశం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అమర్ సింగ్ పేర్కొన్నారు. పపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక ఐబి నుంచి జిల్లా పరిషత్ వరకు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. జిల్లా పరిషత్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులను వినియోగించడం వల్ల భారతదేశంలో ప్రతి రోజు 2200 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల మంది మరణిస్తున్నారని అన్నారు. పొగాకు వ్యాపారులు 15 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారికి విక్రయించకూడదని, విక్రయిస్తే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించేందుకు 2003 సెక్షన్ 6 జివోను ఉపయోగించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రాణాంతకమైన పొగాకు మహామ్మారి నుంచి ప్రజలు తమకు తాముగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పొగాకు ఉపయోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యావంతులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలని తెలిపారు. పొగాకు ఉత్పత్తులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చి అనేక సెక్షన్లను అమలు చేస్తుందని, ఈ వ్యవహారంలో పొరపాట్లు చేసిన వారికి రకరకాల జరిమానాలు, శిక్షలు అమలు చేయవచ్చన్నారు. పొగాకు ఉత్పత్తులైన సిగరేట్లు, బీడీలు, జర్దాల వల్ల నోటి సంబంధమైన వ్యాధులు సంక్రమిస్తాయని, నోటికే ఇబ్బంది తలెత్తితే మొత్తం శరీరానికే ఇబ్బందిగా బావించుకోవాలన్నారు. తమకు కావల్సిన ఆహారాన్ని నోటి ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని, అలాంటిది నోటి సంబంధిత వ్యాధులు సోకితే సదరు వ్యక్తి ప్రాణాలకే ప్రమాదకరమన్నారు. ర్యాలీ అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆరోగ్య పర్యవేక్షకులకు ప్రొజెక్టర్ ద్వారా డాక్టర్ అమర్‌సింగ్ అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రజలను చైతన్యం చేయాలని ఆదేశించారు.