నల్గొండ

పల్లెల సమగ్ర అభివృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాక్లూర్, మే 31: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే టిఆర్‌ఎస్ లక్ష్యమని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పల్లెపల్లెలో గడపగడపకు రక్షిత తాగునీరు, గల్లిగల్లీలో సిసిరోడ్లు, సిసి డ్రైనేజీల నిర్మాణ పనులను శరవేగంగా జరిపిస్తున్నామన్నారు. మంగళవారం మాక్లూర్ మండలం మదన్‌పల్లితండా, అమ్రాద్‌తండా, సట్లాపూర్‌తండా, మానిక్‌బండార్‌తండా, మాక్లూర్, ధర్మారం, మామిడిపల్లి, గుత్ప గ్రామాల్లో చేపట్టిన సిసిరోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ధర్మారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటికి పూర్తి చేస్తున్నామని అన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను, బంగారు తెలంగాణగా తీర్చి దిద్దేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారని కొనియాడారు.