నల్గొండ

ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, మే 31: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందిస్తూ, భవిష్యత్‌లో ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జడ్పీ చైర్మన్ దాఫేదార్ రాజు పిలుపునిచ్చారు. ఇటీవల వెల్లడైన 10వ తరగతి ఫలితాల్లో 10జిపిఎ పాయింట్లు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో మంగళవారం టిఎస్.పిఆర్‌టియు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు ఇల్తెపు శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ దఫేదార్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, నగర మేయర్ ఆకుల సుజాత, టిఎస్.పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు సర్వోత్తమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, డిఇఓ లింగయ్యలు హాజరై ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించి ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు టిఎస్.పిఆర్‌టియు ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మిగతా విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని మరింత పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలను సాధించేందుకు దోహదపడుతుందని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి జడ్పీ స్థాయి సంఘ సమావేశంలో చర్చించి, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా అదనపు గదులు, స్థాయి పెంపుదల, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించేందుకు కృషి చేస్తానని దఫేదార్ రాజు హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానంలో నూతన మార్పులు తీసుకువస్తుందని, ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విధంగా ప్రోత్సహిస్తోందన్నారు. ఇందుకు గాను అన్ని పాఠశాలల్లో కనీస వౌలిక సదుపాయాలతో పాటు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలను అందజేయడం జరుగుతోందన్నారు. వీటికి తోడు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన అందించడం జరుగుతోందన్నారు.

3.83 కోట్ల చేప పిల్లలను విడుదల చేశాం
* జిల్లా మత్స శాఖ ఎడి మహిపాల్
నిజాంసాగర్, మే 31: జిల్లాలోని నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జలాషయాలతోపాటు 529 చెరువులలో3కోట్ల 83లక్షల చేప పిల్లలను వంద శాతం సబ్సిడీపై ఉచితంగా విడుదల చేస్తామని జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకులు మహిపాల్ అన్నారు. మంగళవారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ మత్స్య విత్తనోత్పత్తి కేంద్రంలోకో-ఆపరేటివ్ మార్కెటింగ్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ఎడి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మత్స్య కార్మికులకు సలహాలు, సూచనలు అందించారు. సంఘం ఆదాయ వ్యయాల గురించి చదివి వినిపించారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాషయంలో నీరు లేక పోవడంతోమత్స్య కార్మికులకు ప్రత్యామ్నయ ఉపాది లేక పోవడంతోసంవత్సరం కోసం కరువు భత్యం మంజూరు చేయాలని ఎడిని మత్స్య కార్మికులు కోరారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ హెడ్‌స్లూస్ జలవిద్యుత్ కేంద్రం ప్రధాన కాలువ గేట్ల ముందు బాగంలో జాలీ లేక చేపలు బయటకు వెళ్లి పోతున్నాయని,దీంతోమత్య్సకార్మికులు జీవనోపాది కోల్పోతున్నామని, గేట్ల ముందు జాలీ ఏర్పాటు చేయాలని సభలో ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. మత్స్య కార్మికులు ప్రమాద వశాత్తుగా ప్రాజెక్ట్‌లో మృతి చెందినప్పటికి ఇన్స్‌రెన్స్ కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడంలో జాప్యం చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎడి మాట్లాడుతూ, మత్స్య అబివృద్ది పథకం కింద 2016-15 సంవత్సరానికి గాను జిల్లాలో30 కమ్యూనిటి భవనాలు మంజూరైయ్యాయన్నారు. ఒక్కొక్క భవనానికి పది లక్షల రూపాయలు మంజూరైందన్నారు. టాటా ఎసి , బులెరో14 మంజూరైయ్యాయన్నారు. ఒక యూనిట్‌కు 4 లక్షల రూపాయలు అని అన్నారు. టివిఎస్ ఎక్సెల్ 50 మంజూరైనట్లు తెలిపారు. పోచంపాడ్ మత్స్య విత్తనోత్పత్తిమరమ్మత్తుల కోసం 7కోట్ల రూపాయలు మంజూరైయ్యాయని, పనులు టెండర్‌ల దశలోనే ఉన్నాయన్నారు. అచ్చంపేట్ విత్తనోత్తత్తి కేంద్రం అబివృద్ది చేసేందుకు 5 కోట్ల రూపాయలతోప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. సమావేశంలోఎఎఫ్‌డిఓ రూపేందర్ సింగ్, ఫీల్డ్‌అధికారులు రాజేందర్, జీవన్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షులు రాములు తదితరులు ఉన్నారు.

ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపొద్దు
* కలెక్టర్ డాక్టర్ యోగితారాణా
భీమ్‌గల్, మే 31: గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ఎస్సీ, ఎస్టీలపై వివక్షత చూపకుండా వారి అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా పేర్కొన్నారు. భీమ్‌గల్ మండలం మెండోరా గ్రామంలో మంగళవారం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవానికి కలెక్టర్ యోగితారాణా, ఎస్పీ విశ్వప్రసాద్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దళితులను, గిరిజనులు కులం పేరుతో దూషించినా, అవమానపర్చే విధంగా మాట్లాడినా అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవాలయాల్లో ప్రవేశాన్ని అడ్డుకోవడం, రెండు గ్లాసుల పద్దతి పాటించడం వంటి చేస్తే పౌర హక్కుల చట్టం 1955ప్రకారం శిక్షా అర్హులు అవుతారని హెచ్చరించారు. అత్యాచార చట్టం 1989ప్రకారం దళిత స్ర్తిల గౌరవాన్ని భంగపర్చడం, బలవంతం చేయడం, లైంగిక దాడులకు పాల్పడేవారిపై, బహిరంగంగా అవమానపర్చే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. స్థానిక అధికారులు ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన చట్టాలపై ప్రజలను చైతన్యపర్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. పౌర హక్కుల పరిరక్షణ చట్టంపై గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, ప్రజలను చైతన్యపర్చాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరే విధంగా అధికారులు కృషి చేయాలని, వారు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు తమవంతు సహకారం అందించాలన్నారు. దళిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉందని, వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ ఎస్సీ, ఎస్టీలు ఆర్థికాభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఈ పథకం సమర్ధవంతంగా అమలయ్యే విధంగా సంబంధిత శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ యాదిరెడ్డి, ఆర్మూర్ డిఎస్పీ ఆకుల రాంరెడ్డి, డ్వామా పిడి వెంకటేశం, తహశీల్దార్ వినోద్‌కుమార్, ఎంపిడిఓ గోవింద్‌నాయక్, ఎంపిపి కొండ గోదావరి, జడ్పీటిసి లక్ష్మి, భీమ్‌గల్ సిఐ రమణారెడ్డి, ఎస్‌ఐ సుఖేందర్‌రెడ్డి, మెండోర సర్పంచ్ కమలతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితాలో 35 వేల కొత్త ఓటర్లు
* జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి
ఇందూర్, మే 31: ఓటర్ల జాబితాలో కొత్తగా 35వేల మంది వయోజనులు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారని జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి తెలిపారు. ఓటర్ల జాబితా చివరి ముద్రణ సందర్భంగా మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జెసి తన ఛాంబర్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, 5-10-2015న ముద్రించిన చిత్తుప్రతి జాబితా ప్రకారం 14,20,179మంది ఓటర్లు ఉండగా, ఈ నెల 31న ముద్రించిన తుది జాబితాలో 14,55,969మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. దీని ప్రకారం 35,790మంది కొత్తగా తమ పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందని అన్నారు. వీరిలో 20,711మంది పురుషులు ఉండగా, 15,079మంది స్ర్తిలు ఉన్నారని తెలిపారు. జిల్లాలో మొత్తం 6,98,113మంది పురుషులు కాగా, 7,57,856మంది స్ర్తి ఓటర్లు ఉన్నారని జెసి వెల్లడించారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ తరఫున రవీందర్‌రెడ్డి, బిజెపి తరఫున నాగరాజు, కాంగ్రెస్ తరఫున సుమీర్ అహ్మద్, ఎంఐఎం తరఫున మహ్మద్ అజాజ్ అహ్మద్, నేషనల్టి కాంగ్రెస్ పార్టీ తరపున పవన్‌కుమార్, సిపిఎం తరఫున దండి వెంకట్, ఎన్నికల విభాగం తరఫున కాళీదాస్ తదితరులు పాల్గొన్నారు.

బోధన్ రెవెన్యూ డివిజన్‌లో నవీపేట మండలం
* అమల్లోకి వచ్చిన ఉత్తర్వులు
బోధన్, మే 31: నిజామాబాద్ రెవెన్యూ డివిజన్‌లో ఉన్నటువంటి నవీపేట్ మండలాన్ని బోధన్ రెవెన్యూ డివిజన్‌లో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం నుండి ఈ ఉత్తర్వులు అమల్లోనికి వచ్చాయి. ఇప్పటి వరకు బోధన్ రెవెన్యూ డివిజన్‌లో బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలతో పాటు బోధన్ నియోజకవర్గంలోని రెంజల్, ఎడపల్లి, బోధన్ మండలాలతో కలిపి 12 మండలాలు ఉన్నాయి. తాజాగా బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నవీపేట్‌ను కూడా బోధన్ రెవెన్యూ డివిజన్‌లో చేర్చారు. ఇక నుండి నవీపేట్ మండలానికి చెందిన ప్రజలు ఎటువంటి సర్ట్ఫికెట్లను పొందాలన్నా, రెవెన్యూ భూములకు సంబంధించిన సమస్యలైనా బోధన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి రావాల్సిందే. జరుగబోయే కొత్త జిల్లాలు, తహశీల్ కార్యాలయాల విభజన, కొత్త మండలాల ఏర్పాటును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నవీపేట్‌ను బోధన్ రెవెన్యూ డివిజన్‌లో కలిపేసినట్లు తెలుస్తోంది. సెగ్మెంట్‌ల వారీగా ఉన్న మండలాలను అదే సెగ్మెంట్‌లో గల డివిజన్ గూడుక్రిందకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇక నుండి బోధన్‌లో జరిగే సమీక్షా సమావేశాలకు నవీపేట్ మండల తహశీల్దార్, ఎంపిడివో, ఎంఇవో, ఇతర అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది.

తెలంగాణకు టిటిడి నిధులుతో సౌకర్యాలు
* తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ అర్కల వెల్లడి
కంఠేశ్వర్, మే 31: తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తెలంగాణ ప్రాంతంలోని దేవాలయాల పునరుద్ధరణకు రావాల్సిన నిధులను మంజూరీ చేయించి, భక్తులకు సౌకర్యాల కల్పనకు తనవంతు కృషి చేస్తానని టిటిడి బోర్డు డైరెక్టర్‌గా ఎన్నికైన అర్కల నర్సారెడ్డి పేర్కొన్నారు. టిటిడి సభ్యుడిగా ఎన్నికైన అనంతరం మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లాకు చేరుకోగా, టిడిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా అర్కల నర్సారెడ్డి నగర శివార్లలోని మాధవనగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, సాయినాథుడికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టిటిడి బోర్డు డైరెక్టర్‌గా ఎన్నిక కావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఒక నాయకుడిగా ప్రజాసేవ చేయడమే ముఖ్యం కాదని ఆ వెంకటేశ్వరస్వామి తలచి మాధవ సేవ చేయాలని ఆదేశించడం వల్లే టిటిడి ట్రస్ట్ సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగిందన్నారు. దేశంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేక స్థానం ఉందని, రాష్ట్ర విభజన తర్వాత టిడిపిలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న భావనతో అధినేత చంద్రబాబు తనకు టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా నియమించడం జరిగిందన్నారు. తనపై నమ్మకంతో టిడిపి బోర్డు సభ్యుడిగా నియమించిన అధినేత చంద్రబాబుకు ఈ సందర్భంగా అర్కల కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తానని ఆయన పేర్కొన్నారు. అనంతరం టిడిపి నాయకులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాజమల్లు, బాల్‌కిషన్, సంపత్‌కుమార్, పుప్పాల రవితో పాటు దేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.