నల్గొండ

కాలేజీల సమాయత్తమవుతున్న ఎంజియు అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, జూన్ 3: జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో పని చేస్తున్న 28విద్యా కళాశాలలపై వార్షిక తనిఖీలు ఈనెల 3వ వారం నుండి ప్రారంభం కానున్నాయి. ఎంజియు పరిధిలోని కళాశాలల్లో తనిఖీలు నిర్వహించడానికి అధికారులు సమాయత్తవౌతున్నారు. 2015-16 విద్యా సంవత్సరం నుండి బిఈడి కోర్సును రెండేళ్ల కోర్సుగా మారుస్తూ జాతీయ ఉపాధ్యాయ విద్యా కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం విదితమే. ఆ మేరకు ఒక విద్యా సంవత్సరం పూర్తయ్యంది. అయితే ఈసారి బిఈడి కళాశాలల తనిఖీలు గతంలో మాదిరిగా ఆషామాషీగా కాకుండా పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉస్మానియా, ఎంజియు వర్సిటీల అధికారులు పూర్తి స్థాయిలో బిఈడి కళాశాలల్లోని ప్రతి అంశాన్ని పరిశీలించడమే కాకుండా తగు చర్యలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం వార్షిక తనిఖీలలో భాగంగానే విద్యా కళాశాలలపై అకడమిక్, అధ్యాపక, వౌలిక వసతులు తదితరాలపై తనిఖీలను నిర్వహించనున్నారు. అయితే ప్రతి సంవత్సరం తనిఖీలు షరా మామూలుగానే జరుగుతున్నాయన్న విమర్శలను యూనివర్సిటీ మూటగట్టుకుంటోంది. ఈసారి అలా కాకుండా నిబంధనలను కఠినతరం చేయనున్నారు. దానిలో భాగంగానే ఒక బిఈడి కళాశాలలో పని చేస్తున్న అధ్యాపకులు ఇతర కళాశాలలో పని చేయకుండా పక్కా నిబంధనలను అమలు చేయడానికి అధికారులు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. గతంలో ఒక అధ్యాపకుడు అటు బిఈడి కళాశాలలోను, ఇటు డైట్ కళాశాలలో విధులు నిర్వహించేవారు. అయితే ఇక నుండి అలాంటి వెసులుబాటు లేని విధంగా ప్రతి కళాశాల అధ్యాపకుడికి సంబందించిన ఆధార్‌కార్డును లింక్ చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా గతంలో మాదిరిగా బిఈడి కళాశాలలో అధ్యాపక వృత్తిని నిర్వహించడంకాని, సదరు సర్టిపికెట్లను అప్రూవల్ చేయడం మున్ముందు జరిగే పనికాదన్నది నిషుఠఠ సత్యం. ఆ మేరకు అధికారుల కసరత్తు జరుగుతోంది. అంతే కాకుండా నకిలీ అధ్యాపకులను గుర్తించడమే కాకుండా తనిఖీలలో పట్టుపడినట్లయితే వారికి తగిన శిక్షలను కూడా విధించడానికి అవకాశముందని స్వయంగా యూనివర్సిటీ అధికారులే పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుత నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని కళాశాలలను విజిలెన్స్ అధికారులచే తనిఖీ చేయంచే విధంగా ఆదేశాలను జారీ చేసింది. ఇదిలా ఉండగా ఆ మేరకు జిల్లాలో 75 శాతం డిగ్రీ, జూనియర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ కళాశాలల తనిఖీ పూర్తి చేశారు. ప్రతి కళాశాల తనిఖీలో వౌలిక వసతులు, ఫీజు రియింబర్స్‌మెంట్, అధ్యాపకుల అటెండెన్స్, వేతనాలు, విద్యార్థుల హాజరు, పక్కా భవనాలు తదితర అంశాలను పరిశీలించిన అధికారులు పూర్తి స్థాయి నివేదికలను పై అధికారులకు అందజేసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఆ క్రమంలో భాగంగానే బిఈడి కళాశాలలపై కూడా విజిలెన్స్ తనిఖీలు నిర్వహించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే అన్ని కళాశాలలకు సంబంధించిన యాజమాన్యాలు తనిఖీలపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం, అంతేకాకుండా విద్యారంగ నిపుణులతో తనిఖీలను నిర్వహించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే మరొక వైపు తనిఖీలు నిర్వహించిన కళాశాలలకు సంబందించిన పూర్తి వివరాలు రాష్ట్ర స్థాయి అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ నివేదికలోని విషయాలు వెలుగులోకి వచ్చినట్లయితే జిల్లాలో 40శాతం కళాశాలలు మూత పడవచ్చని పలు కళాశాలల ప్రిన్సిపాల్స్, వ్యవహర్తలు, యాజమాన్యాలు చెప్పడం గమనార్హం. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా మూసగా జరుగుతున్న విద్యా విధానంలో సమూలమైన మార్పులు రావడం మంచిదేనని విద్యా నిపుణులు సైతం పేర్కొంటున్నారు. వౌలిక వసతులు, అధ్యాపకులు సరిగాలేని కళాశాలలతోపాటు, శాశ్వత భవనాలు లేనటువంటి కళాశాలలు ఇంకా కొసమెరుపులో భాగంగానే నిబంధనలను సడలిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాయి. చివరివరకు వేచి చూసే ధోరణిలోనే అవి పని చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కళాశాలల్లో కీలకమైనటువంటి విద్యకు, విద్యార్థుల హాజరుకు పెద్ద పీట వేసినపుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి అవకాశముంది. అలా కాకుండా తూతూ మంత్రంగా కళాశాలలు నడిపినట్లయితే మెరుగైన విద్యను అందించడానికి అవకాశం ఉండదని అధ్యాపకులు, విద్యార్థులు సైతం ఒప్పుకుంటున్నారు. అన్ని పరిస్థితులు మెరుగుగా ఉన్నపుడే సమతుల్యతతో కూడిన విద్య అందించడానికి అవకాశం ఉంటుంది.