నల్గొండ

గాలివాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూన్ 3: చౌటుప్పల్ మండలంలో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. పది నిమిషాలు ప్రజలను అతలాకుతలం చేసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇంటి పైకప్పులు లేచిపోయాయి. పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి. కోళ్ల ఫారాల పైకప్పులు ఎగిరిపోయి తీవ్రమైన నష్టం ఏర్పడింది. చెట్లు విరిగిపడ్డాయి. వ్యవసాయ బావుల వద్ద పశువుల కొట్టాలు కూలిపోయాయి. గడ్డివాములు లేచిపోయాయి. ఉదయం నుంచి ఉక్కపోత తీవ్రంగా ఉంది. మధ్యాహ్నం తర్వాత మేఘాలు కమ్ముకున్నాయి. పెద్ద ఎత్తున వర్షం వస్తుందన్న వాతావరణం ఏర్పడింది. అంతలోనే విపరీతమైన గాలి ప్రారంభమై అతలాకుతలం చేసింది. పది నిమిషాల పాటు ఏమి జరుగుతుందో తెలియని అయోమయం నెలకొంది. కొద్దిపాటి వర్షంతో మేఘాలు కదిలిపోయాయ. దీంతో రైతులు నిరాశకు గురయ్యారు. మండలంలోని స్వాములవారి లింగోటం, నేలపట్ల, లింగోజిగూడెం తదితర గ్రామాలలో గాలివాన తీవ్రత అధికంగా ఉండటంతో నష్టం ఏర్పడింది. సుమారు 50 ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. స్వాములవారి లింగోటంలో కోళ్లఫారం పైకప్పు పూర్తిగా గాలిలో కి లేచింది. సమాచారం అందుకున్న వెంటనే మండల తహశీల్దార్ షేక్ అహ్మద్ గ్రామ రెవిన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. నష్టం జరిగిన ఇళ్లను సందర్శించి అంచనాలు వేశారు. విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు సిబ్బంది తక్షణ చర్యలు తీసుకున్నారు.
వలిగొండలో ...
వలిగొండ: మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం ఒక మోస్తారు వర్షం కురియడంతో ఏట్టకేలకు వాతావరణం చల్లబడింది. గత రెండు నెలలుగా విపరీతమైన ఎండలు కాస్తుండగా గత నెల రోజుల నుండి మండలంలో వడగాల్పులు, ఉక్కపోత, ఎండ వేడిమిని ప్రజలు తట్టుకోలేక పోగా పలువురు వడదెబ్బతో మృతిచెందారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో వాతావరణంలో మార్పు ఏర్పడి చల్లబడింది. అయితే మండలంలోని గొల్నెపల్లి గ్రామంలో ఈదురుగాలుల కారణంగా పిట్టల సారయ్యకు చెందిన రేకుల ఇళ్లు పూర్తిగా కూలిపోయి ధ్వంసం కావడంతో సారయ్యకు దాదాపు 50వేలకు పైగా నష్టం ఏర్పడింది. అదేవిధంగా విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది. సారయ్య నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తియని అతనిని ప్రభుత్వం ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల, పట్టణ అధ్యక్షుడు కల్కూరి రాంచంద్రం, సిర్పంగి స్వామి కోరారు.