నల్గొండ

కేంద్ర పథకాలపై ప్రచారంతో పార్టీ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, జూన్ 3: నరేంద్రమోది నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి పార్టీ అభివృద్ధికి బిజెపి శ్రేణులు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి శాంతకుమార్ పిలుపునిచ్చారు. కోదాడ వాసవీభవన్‌లో శుక్రవారం జరిగిన నియోజకవర్గస్ధాయి బిజెపి ముఖ్యకార్యకర్తల సమావేశానికి అసెంబ్లీ కన్వీనర్ యాదా రమేష్ అద్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి శాంతకుమార్ మాట్లాడుతూ రైతులకు పంటల భీమా పధకం, పంటలకు సరైన గిట్టుబాటు ధర, వ్యవసాయ నీటిపారుదల పధకం, భూసార పరీక్షలు, డ్రిప్ ఇరిగేషన్, మరుగుదొడ్ల మంజూరు, స్వచ్ఛ్భారత్, చిరు వ్యాపారులకు ముద్ర బ్యాంక్ రుణాలు, గ్రామాల విద్యుద్దీకరణ, పట్టణాల సుందరీకరణ, ప్రజలందరికి భీమా సౌకర్యం తదితర పధకాలను బిజేపి నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. కేంద్రంలో బిజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు అన్ని జిల్లాల్లో బిజేపి బహిరంగసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. దానిలో భాగంగా ఈనెల పదవతేదిన సూర్యాపేటలో నిర్వహిస్తున్న బిజేపి బహిరంగసభకు ఆలిండియా అద్యక్షుడు అమిత్‌షా ముఖ్యఅతిధిగా హాజరవుతున్నారని ఆయన వెల్లడించారు. బిజెపి సూర్యాపేట బహిరంగసభను విజయవంతం చేసేందుకు కోదాడ నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త, నాయకులు కృషిచేయాలని, ఎక్కువసంఖ్యలో ప్రజలను సభకు తరలించాలని శాంతకుమార్ కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు కనగాల వెంకట్రామయ్య, నూనె సులోచన, రాష్ట్ర నాయకులు దొంతగాని వీరబాబు, గిరిజనమోర్చా రాష్ట్ర కార్యదర్శి నరినాయక్, గీతాసెల్ జాయింట్ కన్వీనర్ దొంతగాని రాములు, బిజెపి జిల్లా కార్యదర్శి వంగవేటి శ్రీనివాసరావు, పట్టణ అద్యక్షుడు సాతులూరి హన్మంతరావు పాల్గొన్నారు.