నల్గొండ

పోలీస్ స్టేషన్లలో ఎస్పీ తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూన్ 12: పట్టణంలోని పోలీస్‌స్టేషన్లను జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పట్టణంలోని వన్‌టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లతోపాటు సిసిఎస్, కలెక్టరేట్ కార్యాలయం ఎదుటగల మహిళా పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్లను సైతం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో పెండింగ్ ఉన్న కేసులను, ఎఫ్‌ఐఆర్ పుస్తకాలను, ఇతర రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట డిఎస్పీ సుధాకర్, సిఐలు తులా శ్రీనివాస్, రవీందర్, ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు ఉన్నారు.
శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదు
మునుగోడు: శాంతి భద్రతకు ఆటంకం కలిగిస్తే ఎంతటివారినైన ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పోలిస్‌స్టేషన్ల తనిఖీలో బాగంగా ఆదివారం మండల కేంద్రంలో స్థానిక పోలిస్‌స్టేషన్‌ను ఆయన అకస్మిక తనిఖీ జరిపారు. ఈ సందర్బంగా స్టేషన్‌లోని రికార్డులను, ఆవరణంలో శిధిలావస్థలో ఉన్న పోలిస్ క్వార్టర్స్‌ను ఆయన పరిశీలించారు. కేసుల వివరాల గురించి ఎస్సైని అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు స్థానిక పోలిస్‌స్టేషన్‌లో పోలిసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆయన వెంట డిఎస్సీ సుధాకర్, చండూర్ సిఐ రమేష్‌కుమార్, ఎస్సై ఎండి ఇఫ్తెఖార్ అహ్మద్, ఎఎస్సై రామయ్య, కానిస్టేబుల్స్, తదితరులు ఉన్నారు.
కనగల్‌లో
కనగల్: మండలకేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి ఆదివారం ఆకస్మిక తనిఖీ జరిపారు. ఈ సందర్భంగా రికార్డులు, కేసులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డిఎస్పీ సుధాకర్, సిఐ రమేష్‌కుమార్, ఎస్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, ఎఎస్‌ఐ గౌసుద్దీన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు
చండూర్: చండూర్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్సీ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నేరసమాచారాన్ని సిఐ రమేష్‌కుమార్‌ని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు విధులపట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.