నల్గొండ

జానారెడ్డి పొమ్మంటేనే టిఆర్‌ఎస్‌లో చేరామనడం మోసం.. నమ్మవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, జూన్ 23: జానారెడ్డి పొమ్మంటేనే కాంగ్రెస్‌పార్టీని వీడి టిఆర్‌స్‌లో చేరామని ఇటీవల కాంగ్రెస్‌పార్టీని వీడిన ఎంపి, ఎమ్మెల్యేలు చెప్పేవి మోసపు మాటలని, వారి మాటలను నమ్మవద్దని సిఎల్‌పి నేత కుందూరు జానారెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత 40సంవత్సరాలుగా వెన్నంటే ఉండి రాజకీయాలను నేర్చుకోని పార్టీని వీడడం మోసం చేయడమేనని ఆయన అన్నారు. ప్రజలు, కార్యకర్తలు విశ్వసించి ఎన్నికల్లో గెలిపిస్తే వారి మనోభావాలను దెబ్బతీసి స్వప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం సరైందికాదని ఆయన అన్నారు. పార్టీని వీడే విషయం ఎంపి, ఎమ్మెల్యేలు తనకు చెప్పపోతే వినలేదని, అంతేకాకుండా పార్టీని వీడి అపకీర్తి తెచ్చుకోవద్దని, ప్రజలను భాదించినవారవుతారని చెప్పగా ఆలోచిస్తామని చెప్పి అకస్మాత్తుగా పార్టీని వీడి తీరని వ్యధకు గురిచేశారని ఆయన అన్నారు. నేను ఉండగా కాంగ్రెస్‌పార్టీని వీడడం తగదని చెప్పానని అయినా వినకుండా పార్టీని వీడారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉండి పార్టీ ప్రతిష్టతకు కృషిచేస్తానని ఆయన అన్నారు. పార్టీని వీడిని వారికి కాలమే సమాధానం చెప్తుందని ఆయన అన్నారు. కార్యకర్తలకు రాజకీయ పాఠాలు చెప్తానని, ప్రజలు పార్టీని వీడిన వారికి గుణపాఠాలు చెప్తారని ఆయన అన్నారు. సోనియాగాంధిని ఒప్పించడమే కాకుండా ఇతర ప్రతిపక్షపార్టీని ఒప్పించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెస్తే తెలంగాణాను ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీని టిఆర్‌ఎస్‌పార్టీ అడుగడుగున అవమానపరుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్‌పార్టీని రాజకీయంగా అణగదొక్కుతూ ప్రజాస్వామ్య విలువలను మంటకలుపుతుందని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఎలా తెస్తారని ఒకవేళ తెస్తే రాజకీయాల్లో ఉండనని అసెంబ్లీలో చెప్పానని, నిత్యం ఆచరణకు సాధ్యం కాని హామీలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితిలేదని ఆయన అన్నారు. ప్రాజెక్టుల డిజైన్ ఒక్కపంటకే నీరిచ్చే విధంగా డిజైన్ చేయడం జరుగుతుందని కాని ప్రభుత్వం రెండు పంటలకు నీరిస్తాననడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రయోజనం చేకూరుతుందని ప్రజలు ఆశించి ఉద్యమంలో పాల్గొన్నారని కాని ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని ఆయన అన్నారు. సమావేశంలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ చిరుమర్రి కృష్ణయ్య అధ్యక్షతన జరిగని సమావేశంలో శాసనమండలి మాజీ చీఫ్‌విప్ భారతి రాగ్యానాయక్, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు కరీం, నాయకులు దైద సంజీవరెడ్డి, పొదిల శ్రీనివాస్, కోడిరెక్క శౌరి, స్కైలాబ్‌నాయక్, ఈశ్వరాచారి, మర్రి ఎలియాస్, సాంబశివరావు, అంబటి సోమయ్య, పడిగపాటి కోటిరెడ్డి, ఇజ్రాయెల్, హేమానాయక్, బక్కారెడ్డి, సలీం, సత్యనారాయణరెడ్డి, లక్ష్మయ్య, సాంబశివరావు, కోటిరెడ్డి, సాగర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.