నల్గొండ

చార్జీల పెంపుపై నిరసనల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 24: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, బస్ చార్జీలను పెంచడాన్ని నిరసిస్తు విపక్షాలు నిరసన బాట పట్టాయి. జిల్లా వ్యాప్తంగా వామపక్షాలు, టిడిపిల ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలతో నిరసనలు తెలిపారు. సూర్యాపేటలో టిడిపి తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. నల్లగొండ పట్టణంలో బస్టాండ్, స్థానిక సుభాష్ విగ్రహం వద్ధ సిపిఐ, న్యూడెమోక్రసీల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి, నూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డెవిడ్‌లు మాట్లాడుతు ఇప్పటికే కరవుతో, నిత్యావసర ధరల పెరుగుదలతో ఆర్ధికంగా తిప్పలు పడుతున్న ప్రజలపై విద్యుత్, బస్ చార్జీలు పెంచుతు మరింత భారం మోపడం అన్యాయమన్నారు. ప్రభుత్వం వెంటనే పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటలో సిపిఎం, సిపిఐ, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, బిజెపిలు వేర్వేరుగా చార్జీల పెంపును నిరసిస్తు ఆందోళనలు నిర్వహించాయి. మిర్యాలగూడ, భువనగిరి, నల్లగొండ, దేవరకొండ, హాలియా, చౌటుప్పల్, చిట్యాల, రామన్నపేట, వలిగొండ, గుండాల, మోత్కూర్‌లలో చార్జీల పెంపును నిరసిస్తు విపక్షాలు రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దహనాలు నిర్వహించాయి. సోమవారం నుండి జిల్లాలో విపక్షాలు ఆందోళనలు ఉదృతం చేసే దిశగా తమ కార్యాచరణకు పదును పెడుతున్నాయి. ఆయా నిరసన కార్యక్రమాల్లో ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.కాంతయ్య, లొడంగి శ్రవణ్, పి.వీరస్వామి, లెనిన్, ఇందూరి సాగర్, బి.వి.చార్జి, నాగేష్ పాల్గొన్నారు.