నల్గొండ

ఆలయాల సందర్శనతో ప్రశాంతత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూన్ 27: ఆలయాల సందర్శన, దైవారాధనతో మానసిక ప్రశాంతత, భక్తి భావం, ఆద్యాత్మిక చింతన చేకూరుతుందని సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం విటి కాలనీ శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగిన స్వామి వారి కళ్యాణోత్సవాన్ని శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతి స్వామి ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి హాజరైన కోమటిరెడ్డ్డి శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యక్తిగత జీవితంలో కుమారుడి మరణం,రాజకీయ జీవితంలో అనుచరుల వెన్నుపోట్లతో విసిగెత్తిన సందర్భంలో ఆలయాల సందర్శన ఎంతో ప్రశాంతతనిస్తోందని కంట తడి పెట్టుకుని తెలిపారు. ప్రతి వ్యక్తికి దైనందిన కార్యకలాపాల వత్తిడిని దూరం చేసుకునేందుకు ఆలయాల సందర్శన, దైవారాధన ఉపకరిస్తుందన్నారు. తనకు ప్రస్తుతం తన కుమారుని పేరున నిర్మించిన ప్రతీక్ కళాశాల, విటి కాలనీ శ్రీవారి ఆలయాల సందర్శనకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణోత్సవం సందర్భంగా విద్యాశంకర భారతీ స్వామి అనుగ్రహ బాషణం చేశారు. పూర్ణాహుతి, ధ్వజమండపోద్వాసన, మహానివేదన, మహాప్రసాద, అన్నసంతర్పణ, గరుడ వాహన సేవ, పూజాధికాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రావుల శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ వ్యవస్థాపకులు కెవి నర్సింహ్మమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు రేనెపల్లి లక్ష్మణ్‌రావు, కూతురు శ్రీనివాస్‌రెడ్డి, నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, పురుషోత్తం, నూకల జైపాల్‌రెడ్డి, రావిరాల వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జి వెంకట్‌రెడ్డి, అర్చకులు పవన్‌కుమార్‌శర్మ, సుబ్రహ్మణ్యశాస్ర్తీ, సాయి శర్మ, నాగరాజు శర్మ తదితరులు పాల్గొన్నారు.