నల్గొండ

న్యాయవాదుల నిరాహార దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ లీగల్, జూన్ 28: ఆంధ్రా న్యాయమూర్తులు తెలంగాణ వదిలి వెళ్లాలని నల్లగొండ న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులు బహిష్కరించి కోర్టు ముందు నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ సభ్యులు ఎ.అనంతసేన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్ష్య కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, వరప్రసాదుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనేక త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ సీమాంధ్ర న్యామూర్తుల మూలంగా నష్టపోయే ప్రమాదముందన్నారు. ఇప్పటికైనా హైకోర్టు సీమాంద్ర న్యామూర్తులను ఎపికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష్య కార్యదర్శి కల్లూరి యాదయ్య, కొండ శ్రీనివాస్, న్యాయవాదులు మేడం మోహన్‌రెడ్డి, నిమ్మల భీమార్జున్‌రెడ్డి, నాంపల్లి నర్సింహ్మ, దర్శనం నర్సింహ్మ, ఐ.లాలయ్యగౌడ్, టి.శేఖర్, పి.శేఖర్, నూకల నర్సింహ్మారెడ్డి, పి.శ్యాంసుందర్, గోలి అమరెందర్‌రెడ్డి, మల్లేపల్లి ఆదిరెడ్డి, నూకల సంధ్యారాణి, కల్పన నఫీజ్ ఫాతీమ, ఎం.లెనిన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.