నల్గొండ

నలుగురు డిఎస్పీల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 1: జిల్లాలో మిర్యాలగూడ, సూర్యాపేట, సిసిఎస్ నల్లగొండ, స్పెషల్ బ్రాంచ్ నల్లగొండ డిఎస్పీలను బదిలీ చేస్తు డిజిపి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మిర్యాలగూడ డిఎస్పీ జి.సందీప్‌ను బదిలీ చేస్తు హైద్రాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో మిర్యాలగూడ డిఎస్పీగా ఇంటలిజెన్స్ డిఎస్పీ ఎస్.రాంగోపాల్‌రావును నియమించారు. సూర్యాపేట డిఎస్పీ అబ్ధుల్ రశీద్‌ను బదిలీ చేస్తు హైద్రాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఆయన స్థానంలో నల్లగొండ సిసిఎస్ డిఎస్పీ వి.సునీతాచంద్రమోహన్‌ను సూర్యాపేట డిఎస్పీగా బదిలీ చేశారు. నల్లగొండ ఎస్‌బి డిఎస్పీ సిహెచ్.శ్రుతకీర్తిని చేవేళ్ల డిఎస్పీగా బదిలీ చేశారు. వారంత బదిలీ ఉత్తర్వుల మేరకు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.