నల్గొండ

కార్పొరేట్‌కు దీటుగా గురుకుల విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 1: కార్పోరేట్ విద్యాసంస్ధలకు ధీటుగా అన్నివర్గాల విద్యార్ధులకు మెరుగైన ప్రమాణాలతో విద్యనందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాలను ఏర్పాటుచేస్తుందని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ది,సంక్షేమశాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రమైన సూర్యాపేటలో ఈ విద్యాసంవత్సరం నూతనంగా ఏర్పాటుచేసిన మైనార్టీ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ సమాజంలో అనేక రుగ్మతులకు కారణం అవిద్యనని అలాంటి విద్యావిధానాన్ని పటిష్టంచేసి నిరుపేదలకు కూడ కార్పొరేట్ స్ధాయిలో విద్యను అందించి అందరినీ అభివృద్దిలోకి తెచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేస్తున్నారని చెప్పారు. భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో చేయని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ విద్యాసంవత్సరంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 250మైనార్టీ గురుకుల పాఠశాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. మన విద్యార్ధులు ప్రస్తుత పోటిప్రపంచానికి ధీటుగా నిలిచేందుకు సమాజంలో చదువులకు దూరంగా ఉంటున్న పేదవర్గాల విద్యార్ధులకు కార్పొరేట్‌కు ధీటుగా విద్యనందించేందుకే కొత్తగా గురుకలాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. పేదలకు విద్యనందించేందుకు ఎన్నికోట్లు ఖర్చు అయిన భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ప్రతి అక్షరాన్ని అమలుచేస్తూ అన్నివర్గాల వారికి రాజ్యాంగపరంగా అందాల్సిన ఫలాలను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రెండేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ది పథంలో ముందుకు సాగుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కెసిఆర్ పాలన తీరును కెసిఆర్ అంటె గిట్టని వారు సైతం ప్రశంసిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గురుకుల పాఠశాలల ద్వారా విద్యతో అన్ని సామాజికవర్గాలు ఉన్నతస్ధాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీశాఖ ఈడి సలీంపాష, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, అదనపు జెసి వెంకట్రావ్, ఇంచార్జీ ఆర్డీవో కిషన్‌రావు, ఎంపిపి వట్టె జానయ్యయాదవ్, మైనార్టీశాఖ ఓఎస్‌డి సిరాజ్‌ఖాన్, పాఠశాల ప్రిన్సిపాల్ జానీమియా, కౌన్సిలర్లు రంగినేని ఉమా, జ్యోతి కరుణాకర్, తాహేర్, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.