నల్గొండ

ప్రైవేటు బస్సు బోల్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టంగూర్, జూలై 1: హైదరాబాద్- విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై మండల పరిధిలోని ముత్యాలమ్మగూడెం గ్రామ అవాసం తూర్పుబావిగూడెం స్టేజివద్ద గురువారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్స్ వోల్వోబస్సు అదుపుతప్పి ఫల్టీకొట్టడంతో పదిమంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలుకాగా మరో పదిమందికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం సితార ట్రావెల్స్‌కు చెందిన ఎపి 16టిహెచ్ 9 నెంబరుగల వోల్వోబస్సు 46మంది ప్రయాణీకులతో గురువారం రాత్రి 11.30లకు హైదరాబాద్ నుండి రాజమండ్రికి బయలుదేరింది. ఈ బస్సు అర్ధరాత్రి 1.30గంటల ప్రాంతంలో ముత్యాలమ్మగూడెం శివారులోని తూర్పుబావిగూడెం స్టేజివద్ద ముందుగా వెళ్తున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో అతివేగం కారణంగా అదుపుతప్పి రోడ్డుపక్కకు రెండు ఫల్టీలు కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణీస్తున్న హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన బి.ఉషా, ఆమె ఏడాదిన్నర కుమార్తె తన్నవి, అన్నవరంకు చెందిన భార్యభర్తలు కోడి వాసా, కోడిచక్రం, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మనుపాటి బాబురావు, తలుపులమ్మ, చీరాలకు చెందిన ప్రవీణ్‌లతోపాటు మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా బస్సులో ప్రయాణీస్తున్న మరో పదిమంది ప్రయాణీకులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కట్టంగూర్ ప్రొబిషనరీ ఎస్‌ఐ సుదర్శన్‌యాదవ్ తన సిబ్బందితో ప్రమాదస్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని ఆసుపత్రి, నకిరేకల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగం, డ్రైవర్ అజాగ్రత్తవల్లే ఈప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.