నల్గొండ

ఊపందుకున్న ఖరీఫ్ ... తగ్గిన పత్తిసాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, జూలై 2: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజుల నుండి వర్షాలు అడపదడపా కురుస్తుండడంతో నల్లగొండ మండలంలో ఖరీఫ్ పంటల సాగు ఊపందుకుంది. వర్షాధార పంటలైన పత్తి తదితరలు ఆనవాయితిగా వేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు మోటార్లు ఎండిపోయి వరి ధాన్యం పంట విస్తీర్ణం తగ్గిపోతుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంకు ముందే ప్రభుత్వం పత్తి పంటను వేసి నష్టాల పాలు కావద్దని తెలపడంతో రైతులు ఏం పంట వేయాలో తెలియని స్థితిలో ఉండి పత్తి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. కొంత మంది రైతులు కొంత పత్తి మరికొంత కంది, వేరుశనగ పంటలు సాగు చేసేందుకు ఉపక్రమించారు. రైతులకు అవగాహన సదస్సులలో పత్తి పంట సాగు-నష్టాలపై అధికారులు తెలియజేసినప్పటికి కొన్ని గ్రామాలలో రైతులు పత్తి పంట పండించేందుకు సిద్ధమయ్యారు. నల్లగొండ మండలంలో గత ఏడాది 14వేల ఎకరాల్లో పత్తి పండించగా నేడు సగానికే పరిమితమై ఎనిమిది ఎకరాలలో సాగు చేస్తున్నారు. అదే విధంగా కందులు ఐదు నుండి ఆరు ఎకరాలలో, వేరు శనగ 2వేల ఎకరాల్లో, పెసర పంటలు 500 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఈ ఏడాదైనా వర్షాలు సంవృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని రైతన్నలు కోరుతున్నారు.

బునాదిగాని కాల్వతో చెరువులకు జలకళ: బూర

భువనగిరి, జూలై 2: బునాదిగాని కాల్వద్వారా బొల్లెపల్లి, అనాజిపురం చెర్వులకు నీరుచేరి జలకళను సంతరించుకున్నాయని భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. శనివారం మండలంలోని అనాజిపురం చెర్వును ఎంపి పరిశీలించారు. బునాదిగాని కాల్వపనులను పూర్తిచేసి బొల్లెపల్లి, అనాజిపురం చెర్వుల మాదిరిగానే మిగిలిన చెర్వులను మూసి నీటితో నింపుతామని ఆయన అన్నారు. రాష్ట్ర టిఆర్‌ఎస్ నాయకులు జడల అమరేందర్, భువనగిరి ఎంపిపి తోటకూరి వెంకటేశ్‌యాదవ్, వలిగొండ ఎంపిపి శ్రీరాముల నాగరాజు, జడ్పిటిసి మొగుళ్ల శ్రీనివాస్, అనాజీపురం ఎంపిటిసి దాసరి పాండు తదితరులు పాల్గొన్నారు.
జీవనది ద్వారా రైతుల కలసాకారం
బీబీనగర్: మూసి జీవనదిద్వారా నియోజకవర్గంలోని బీడుబూములన్ని పంట పొలాలుగా మారి రైతుల కవ సాకారమైందని భువనగిరి ఎంపి బూరనరర్సయ్యగౌడ్ అన్నారు. శనివారం మండలంలోని మక్తఅనంతారం, ఎర్రగుంటచెరువు,ఎంకిర్యాల, పడమటి సోమారం, గొల్లగూడిం, మఖ్దుంపల్లి గ్రామాలలో కొనసాగుతున్న బునాదిగాని కాల్వను ఎంపి పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీమేరకు కాల్వ పనులు పూర్తిచేసామన్నారు. అనాజిపురం చెర్వు నీటితోనిండగానె రాష్ట్ర ఇరిగేషన్‌శాఖమంత్రి, జిల్లా మంత్రితో సాగునీటిని అధికారికంగా విడుదలచేస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిపి గోళిప్రణిత పింగల్‌రెడ్డి, డిఇ రవీందర్, మండల పార్టీ అధ్యక్షుడు పిట్టల అశోక్, సర్పంచ్‌లు ఒగ్గుపాండు, శ్రీరాంపద్మజంగయ్య, ఎంపిటిసిలు మంచాల రవికుమార్, కడెం శేఖర్, ఏర్పుల శ్రీశైలం, బింగి అలివేలుమంగ శ్రీనివాస్, జానా లావణ్యమల్లేశ్, ప్రతిభ బస్వయ్యగౌడ్, నాయకులు ఆకుల ప్రభాకర్‌రావ్, పంజాల సతీష్‌గౌడ్, ఒంగూరి శంకర్, మంచాల నరహరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపి మఖ్దుంపల్లి ఉన్నతపాఠశాల, బీబీనగర్ రహదారి బంగ్లాలో మొక్కలునాటి హారితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేయాలని అన్నారు.