నల్గొండ

పాఠశాలల్లో ఎన్నికల కోలహలం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 24: పాఠశాలల్లో యాజమాన్య కమిటీల ఎన్నికలకు నగరా మోగింది. ఆగస్టు 1నుండి 10వరకు పాఠశాలల యాజమాన్య కమిటీల(ఎస్‌ఎంసీ) ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేయడంతో గ్రామాలు, పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాకమిటీల ఎన్నికల కోలాహలానికి తెరలేచినట్లయింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి సారిగా జరుగుతున్న పాఠశాల యాజమాన్య కమిటీలు రాజకీయాలతో సంబంధం లేకుండా పూర్తిగా పాఠశాల పరిధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి నిర్వహించుకునేవే ఐనప్పటికి స్థానిక రాజకీయ పార్టీల జోక్యం పరోక్షంగానైనా ఈ కమిటీల ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. ఈ నేపధ్యంలో పాఠశాల యాజమాన్య కమిటీల్లో పాగా కోసం గ్రామాల్లో రాజకీయ పక్షాలు చక్రం తిప్పే అవకాశముండటంతో ఎన్నికలు చాలచోట్ల హోరాహోరిగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలో 3,352ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం మేరకు పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు నిర్వహించనున్నారు. యాజమాన్య కమిటీలకు పాఠశాల అభివృద్ధి పనులలో భాగస్వామ్యం కల్గివుండటంతో కమిటీల్లో ఆధిపత్యం కోసం గ్రామాల్లో రాజకీయ వర్గాలు గట్టిగానే ప్రయత్నించనుండటంతో ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. కాగా పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికల నిర్వాహణకు నేడు ఎంఈవోలకు శిక్షణా, 27న ప్రధానోపాధ్యాయులకు వీడియోకాన్ఫరెన్స్‌తో అవగాహాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రాథమిక పాఠశాలలో ఎస్‌ఎంసీ ఎన్నికల కమిటీలో 1నుండి 5వ తరగతి వరకు తరగతికి ముగ్గురు చొప్పున 15మందిని, ప్రాథమికోన్నత పాఠశాలలో 1నుండి 7తరగతి వరకు 21మందిని, 8వ తరగతి ఉంటే 24మందిని ఎన్నుకోవాలి. ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి 8వ తరగతి వరకు తొమ్మిది మందిని ఎన్నుకోవాలి. ప్రతి కమిటీలో ఇద్దరు మహిళా సభ్యులు విధిగా ఎన్నికయ్యేలా చూడాలి. ఎన్నికైన సభ్యుల నుండి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవాలి. వీరిలో ఒకరు బిసి, ఎస్టీ, ఎస్టీ వర్గాల నుండి ఎన్నుకోవాలి, అందులో ఒక మహిళ తప్పనసరిగా ఉండాలి. కమిటీలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ప్రధానోపాధ్యాయుడిగా, కన్వీనర్‌గా వ్యవహారిస్తారు. అలాగే ఎంఈవో ఒక ఉపాధ్యాయుడిని కమిటీలో నామినేట్ చేస్తారు. కమిటీలో పంచాయతీ వార్డు సభ్యుడు, లేక కౌన్సిలర్, అంగన్‌వాడీ కార్యకర్త, ఏఎన్‌ఎం, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సభ్యులుగా ఉంటారు. కోఆప్షన్ సభ్యులుగా పాఠశాల అభివృద్ధికి తోడ్పాటునందించిన దాతలు, విద్యావేత్తలు, స్వచ్చంద సంస్థల లేక సేవా సంస్థల, పూర్వవిద్యార్థులకు చెందిన ఇద్దరిని నామినేట్ చేసుకుంటారు.