నల్గొండ

బంగారు తెలంగాణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్వపల్లి, జూలై 29: ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని తిమ్మాపురంలో జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాలలో జరిగిన హరితహారంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రజలకు వచ్చిన హామీలనే కాక అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారన్నారు. వానలు వాపస్ రావాలన్న, వానరం వెనక్కుపోవాలన్నా హరితహారం ద్వారా మొక్కలు పెంచాలన్నారు. రాష్ట్రంలో 33శాతం ఉండాల్సిన అడవులు 23శాతమే ఉన్నాయన్నారు. నల్లగొండ జిల్లాలో 5శాతం మాత్రమే అడవులు ఉన్నాయని వాటినే పెంచేందుకే ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లాలో ప్రారంభించారన్నారు. ప్రతి మనిషి 400మొక్కలు నాటాలని అప్పుడే వాతావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. నల్లగొండ జిల్లాలో 4కోట్ల 70లక్షల మొక్కలు నాటేందుకు గాను ప్రస్తుతం 3కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. తిమ్మాపురం పాఠశాలలో వేయి మొక్కలు నాటుతున్నందున పాఠశాలకు వాటర్‌ట్యాంక్, మరుగుదొడ్లు, బెంచీలు మంజూరీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మార్కెట్ కమిటి చైర్మన్ పాశం విజయయాదవ్‌రెడ్డి, ఎంపిపి దావుల మనీషా, ఎంపిడివో బి.శిరీష, వైస్ ఎంపిపి బొడ్డు వెంకన్న, సర్పంచ్ వీరస్వామి పాల్గొన్నారు.